సౌందర్యతో ఎఫైర్ అంటున్న జగపతి

సౌందర్యతో ఎఫైర్ అంటున్న జగపతి

చదవడానికి ఇలా చాలా ఇబ్బందికరంగానే అనిపించి ఉండొచ్చు. ఓ చనిపోయిన హీరోయిన్ గురించి ఇలాంటి మాటలేంటి అన్న ఫీలింగ్ కలిగి ఉండొచ్చు. ఐతే స్వయంగా జగపతిబాబే ఆ మాట అన్నాడు. హీరోగా పీక్స్ లో ఉన్న టైంలో జగపతికి కొందరు హీరోయిన్లతో ముడిపెట్టింది మీడియా.

ఆయన అప్పట్లో ఆ రూమర్లను ఖండించింది కూడా లేదు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఒక ఇంటర్వ్యూలో సౌందర్యతో ఎఫైర్ అన్న అప్పటి ఆరోపణలపై స్పందించాడు జగ్గూ భాయ్. సౌందర్యతో తనకు ఎఫైర్ ఉన్న మాట వాస్తవమే అని.. కానీ అది జనాలు అనుకునేది కాదని జగపతి వ్యాఖ్యానించాడు.

తాను మహిళల్ని ప్రేమిస్తానని.. అందులో సందేహం లేదని.. ఐతే తాను ఎప్పుడూ దొడ్డిదారిలో వెళ్లనని జగపతి అన్నాడు. మహిళలు కూడా తనను అభిమానిస్తారని.. ప్రేమిస్తారని.. సౌందర్యతో తనకు ఎఫైర్ లేదంటే జనాలు నమ్మరని జగపతి అన్నాడు. ఆమె నిజానికి తనకు మంచి స్నేహితురాలని.. విమాన ప్రమాదంలో ఆమెతో పాటే చనిపోయిన తన సోదరుడు అమర్ కూడా మంచి మిత్రుడని జగపతి అన్నాడు. తాను అప్పట్లో సౌందర్య కుటుంబంలో ఒక సభ్యుడిలా ఉండేవాడిననని.. వాళ్లింట్లో ఏ వేడుక జరిగినా తనకు ఆహ్వానం అందేదని జగపతి తెలిపాడు. ఎఫైర్ అంటే సెక్స్ రిలేషన్ మాత్రమే కాదని.. అలా ఆలోచించే వాళ్లు పర్వర్ట్స్ అని అన్నాడు.

సౌందర్యతో ఎఫైర్ ఉందంటే తనకది క్రెడిటే తప్ప.. మైనస్ కాదని.. ఆమెది హోమ్లీ మనస్తత్వం అని.. ఆమె జనాలు సినిమా హీరోయిన్ల గురించి అనుకునే రకం కాదని జగపతి చెప్పాడు. ఐతే అసందర్భోచితంగా ఇప్పుడు సౌందర్యతో ఎఫైర్ గురించి జగపతి ఎందుకు ఇంత వివరంగా మాట్లాడాల్సి వచ్చిందో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు