'మహేష్ నంబర్ వన్ అందగాడు'

'మహేష్ నంబర్ వన్ అందగాడు'

ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరోను పొగడడం అరుదు. అలా పొగడాల్సిన సందర్భం వచ్చినా.. ఇగో అడ్డొచ్చి చాలామంది ఆగిపోతారు. కానీ ఇగో పక్కనబెట్టి పొగిడితే.. అది హుందాగా ఉంటుంది. దాని వల్ల మంచి పేరే వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇలాగే ఆలోచించినట్లున్నాడు. టాలీవుడ్లోని ఇద్దరు హీరోల మీద ప్రశంసలు కురిపించాడు తారక్. టాలీవుడ్లో అత్యంత అందగాడు మహేష్ బాబేనని ఎన్టీఆర్ కితాబివ్వడం విశేషం.

ఈ విషయంలో మరో మాట లేదని కూడా ఎన్టీఆర్ అన్నాడు. ఐఫా అవార్డుల వేడుక సందర్భంగా రానా దగ్గుబాటి ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేస్తూ.. టాలీవుడ్లో అత్యంత అందగాడు ఎవరని అడిగితే అందుకు సమాధానంగా మహేష్ పేరు చెప్పాడు ఎన్టీఆర్. ఇక నటుడిగా తనకు నాని అంటే చాలా ఇష్టమని ఎన్టీఆర్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక వాయిస్ పరంగా అంటే.. రానా దగ్గుబాటి అంటే ఇష్టమంటూ తనను ఇంటర్వ్యూ చేస్తున్న రానాను పడేశాడు తారక్.

ఐఫా వేడుకలో ‘జనతా గ్యారేజ్’ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న సందర్భంగా ఎన్టీఆర్ చేసిన ప్రసంగం కూడా అందరి మనసుల్ని గెలుచుకుంది. తనతో పాటు ఇక్కడ నామినేషన్ అందుకున్న ప్రతి హీరోకూ ఈ అవార్డు దక్కుతుందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. కెరీర్ ఆరంభంలోనే స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్.. అప్పట్లో కొంచెం పొగరుగా కనిపించేవాడు. వయసుకు మించి మాట్లాడేవాడు. కానీ వయసు పెరిగే కొద్దీ అతడిలో మెచ్యూరిటీ వచ్చింది. వినమ్రత పెరిగింది. అందుకు తాజాగా వ్యాఖ్యలే నిదర్శనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు