ఈసారి పవన్‌ పప్పులు ఉడకవు

ఈసారి పవన్‌ పప్పులు ఉడకవు

వరుసగా మూడు సినిమాలని శరత్‌ మరార్‌ నిర్మాణంలో చేసిన పవన్‌కళ్యాణ్‌ వాటన్నిటినీ తనకి అనుకూలమైన టైమ్‌లో చేసుకున్నాడు. నచ్చినపుడు షూటింగ్‌ పెట్టుకుని, కుదరనప్పుడు వెళ్లకుండా పవన్‌ మూడ్‌కి అనుగుణంగా ఆ చిత్రాల షూటింగ్‌ జరిగింది.

'గోపాల గోపాల' చిత్రానికి ఇచ్చిన కొద్ది రోజుల కాల్షీట్స్‌ని వాయిదా వేసుకుంటూ సినిమా పూర్తయ్యే దశకి కానీ పవన్‌ సెట్లో అడుగు పెట్టలేదు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌కి కూడా డెబ్బయ్‌ శాతం షూటింగ్‌ నెల రోజుల్లో పూర్తి చేసారు. కాటమరాయుడు సెకండాఫ్‌ మొత్తం మూడు వారాల్లో తీసారని చెప్పుకుంటున్నారు. ఈ హడావిడి వ్యవహారం వల్ల ఆయా చిత్రాల క్వాలిటీ ఎలా తయారైందనేది తెలిసిందే.

తన సొంత బ్యానర్‌ కావడంతో పవన్‌ అనుకున్నట్టు అయిపోయింది కానీ తన కొత్త చిత్రానికి ఇవన్నీ కుదరవు. త్రివిక్రమ్‌ సినిమా కోసం ఎనభై రోజులు డేట్స్‌ ఇచ్చిన పవన్‌ షెడ్యూల్స్‌ మధ్య వచ్చే బ్రేక్‌ తప్ప వేరే బ్రేక్‌ తీసుకోవడానికి లేదు. అడపాదడపా రాజకీయ మీటింగ్స్‌ పెట్టి, ఉద్దానం లాంటి సమస్యలపై పోరాడుతూ వస్తోన్న పవన్‌ అవన్నీ షెడ్యూల్‌ గ్యాప్‌లోనే పెట్టుకోవాలి తప్ప సడన్‌గా షూటింగ్‌కి లీవ్‌ పెట్టడం కుదరదు.

ఎందుకంటే ఈ చిత్రానికి టైట్‌ షెడ్యూల్‌ వేసుకుని, ఆర్టిస్టుల డేట్లు, లొకేషన్లు అన్నీ లాక్‌ చేసి పెట్టుకున్నారు. ఒక్క రోజు షూటింగ్‌ అప్‌సెట్‌ అయినా టోటల్‌గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనిని పవన్‌కి క్లియర్‌గా చెప్పి, అతడి నుంచి మాట తీసుకున్నాకే బరిలోకి దిగుతున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు