బాలయ్య సరసన అమల?

బాలయ్య సరసన అమల?

బాలకృష్ణతో పూరి జగన్నాథ్‌ తీస్తోన్న చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌ని ఇంకా ఖరారు చేయలేదు. ఇందులో అందరూ కొత్తవాళ్లని పరిచయం చెయ్యాలని పూరి జగన్నాథ్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. ముగ్గురు హీరోయిన్ల పాత్రల కోసం కొత్త కథానాయికల కోసమే అన్వేషిస్తున్నాడు.

అయితే బాలయ్యలాంటి సీనియర్‌ స్టార్‌ పక్కన అంతా కొత్తవాళ్లే అయితే బాగోదనే ఫీడ్‌బ్యాక్‌ జగన్‌కి వచ్చిందట. అందుకే మెయిన్‌ ఫిమేల్‌ లీడ్‌ క్యారెక్టర్‌కి ఎవరైనా తెలిసిన హీరోయిన్‌ని తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఈ క్యారెక్టర్‌కి అమలా పాల్‌ పేరు పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అమల ఇంతకుముందు పూరి జగన్నాథ్‌తో 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటించింది.

పెళ్లి అయిన తర్వాత కూడా నటన కొనసాగిస్తోన్న అమలా పాల్‌ తమిళంలో ధనుష్‌లాంటి యంగ్‌ హీరోలతో పని చేస్తోంది. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌లాంటి యువ హీరోలతో నటించిన అమలా పాల్‌ మరి బాలకృష్ణతో నటించడానికి సిద్ధమో కాదో తెలీదు. అమల కాకపోతే ఈ పాత్రకి ఛార్మిని తీసుకుంటాడని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి. బాలయ్యని స్టయిలిష్‌ డాన్‌ క్యారెక్టర్‌లో చూపిస్తోన్న పూరి జగన్నాథ్‌ ఈ చిత్రం కోసం ఉస్తాద్‌ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నాడనేది మరో గాసిప్‌.

ఈమధ్య కాలంలో మొదలైన చిత్రాల్లో ఇది సినీ ప్రియులని బాగా ఆకర్షిస్తోంది. పూరి జగన్నాథ్‌ స్టయిల్లో బాలకృష్ణ ఎలా కనిపిస్తాడనే ఊహే బాలయ్య అభిమానులని ఉర్రూతలూగిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు