అనుష్క‌తో బాహుబ‌లికి ఎంత లాస్ అంటే?.

అనుష్క‌తో బాహుబ‌లికి ఎంత లాస్ అంటే?.

ఒక ఆర్టిస్ట్ కార‌ణంగా నిర్మాత‌లకు ఇబ్బంది ఎదురైతే ర‌చ్చ‌.. ర‌చ్చ మారుతుంది. అలాంటిది ఒక హీరోయిన్ కార‌ణంగా నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.20కోట్లు లాస్ అయితే? ఇంకేమైనా ఉంటుందా? కానీ.. అంత న‌ష్టాన్ని సైతం భ‌రించిన వైనం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. టాక్ ఆఫ్ ద టౌన్ గా.. ఇండియ‌న్ సినిమా ప్రైడ్‌గా అభివ‌ర్ణిస్తున్న బాహుబ‌లి 2కి సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర స‌మాచారం ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఈ సినిమాలో అనుష్క పాత్ర గురించి తెలిసిందే. ఫ‌స్ట్ పార్ట్ తీసేట‌ప్పుడే.. సెకండ్ పార్టీకి సంబంధించిన చాలా సీన్లు తీశారు. అయితే.. ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్‌కి.. సెకండ్ పార్ట్ షూటింగ్‌కు మ‌ధ్య గ్యాప్ దాదాపు రెండేళ్ల‌కు పైనే.
ఇక్క‌డ చిక్కంతా అనుష్క‌తోనే. ఆమె మ‌ధ్య‌లో చేసిన ఒక సినిమాతో బాగా లావుకావ‌టం.. ఆ త‌ర్వాత ఆమె బ‌రువు త‌గ్గ‌ని ప‌రిస్థితి. మ‌ధ్య‌లో కాస్త లావు త‌గ్గినా.. ఫ‌స్ట్ పార్ట్ షూట్ టైంలో ఉన్నంత నాజుగ్గా.. మ‌ల్లెమొగ్గ‌గా లేదు. అలా అని సెకండ్ పార్ట్ లో ఆమెను ఇప్పుడున్న‌ట్లుగా చూపిస్తే.. రెండు సీన్ల మ‌ధ్య‌న తేడా కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

అందుకే.. మొద‌టి పార్ట్ స‌మ‌యంలో తీసిన సెకండ్ పార్ట్ షూట్ స‌న్నివేశాల‌ను తొల‌గించాల‌ని చిత్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి డిసైడ్ అయ్యాడ‌ట‌. దీంతో.. మ‌ళ్లీ షూట్ అంటే టైంతో పాటు.. ఖ‌ర్చు కూడా భారీగా అయ్యే ప‌రిస్థితి. అయిన‌ప్ప‌టికీ వెన‌క్కి త‌గ్గ‌లేద‌ట‌. స్విటీ బొద్దుత‌నం పుణ్య‌మా అని బాహుబ‌లి నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.20కోట్లు లాస్ అని చెబున్నారు. అయిన‌ప్ప‌టికీ క్వాలిటీ విష‌యంలో కంట్రోల్ కాకూడ‌ద‌ని డిసైడ్ అయ్యార‌ట‌. దీంతో.. ఫ‌స్ట్ పార్ట్ స‌మ‌యంలో తీసిన సెండ్‌హాఫ్‌లో స్వీటీ స‌న్నివేశాల్ని తీసేసి.. ఫ్రెష్ గా రీషూట్ చేశార‌ట‌. ఇందుకోసం రూ.20కోట్ల మేర భారం ప‌డింద‌ని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు