చిరు వచ్చి వైట్ల గురించి ఏం మాట్లాడతాడో

చిరు వచ్చి వైట్ల గురించి ఏం మాట్లాడతాడో

‘ఖైదీ నెంబర్ 150’ చేయడానికి ముందే ‘బ్రూస్ లీ’ సినిమాలో క్యామియో ద్వారా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. నిజానికి ఆయన అలా చేయాల్సిన అవసరం లేదు. కానీ రామ్ చరణ్ కెరీర్లో ‘బ్రూస్ లీ’ స్పెషల్ మూవీ కావచ్చన్న అంచనాతో ఆ సినిమాలో ఆయన క్యామియో చేశారు.

‘మగధీర’లో చేశా కాబట్టి అది ఇండస్ట్రీ హిట్ అయిందని.. ‘బ్రూస్ లీ’ కూడా బ్లాక్ బస్టర్ అయిపోతుందని ఆశించినట్లున్నాడు చిరు. తీరా చూస్తే ఆ సినిమాకు ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. చిరు పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీను వైట్ల నిలబెట్టలేకపోయాడు. ‘బ్రూస్ లీ’ దెబ్బకు చరణ్ కెరీరే డోలాయమానంలో పడిపోయిన పరిస్థితి.

ఐతే ‘బ్రూస్ లీ’ లాంటి డిజాస్టర్ ఇచ్చినా శ్రీను వైట్లకు ఆశ్చర్యకరంగా మళ్లీ ఓ మెగా హీరోతోనే పని చేసే అవకాశం దక్కింది. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ‘మిస్టర్’ రూపొందించాడతను. ఈ చిత్రం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ చేసిన చిత్ర యూనిట్.. ఈ నెల 30న హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆడియో వేడుక చేయబోతోంది. ఈ వేడుకకు చిరంజీవే ముఖ్య అతిథిగా రాబోతుండటం విశేషం.

ఇంతకుముందులాగా చిరు మిగతా మెగా హీరోల వేడుకలకు అంతగా రావట్లేదు. సాయిధరమ్ తేజ్ సినిమా ‘విన్నర్’ వేడుకకు కూడా చిరు హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ‘మిస్టర్’ ఆడియో ఫంక్షన్ కు ఆయన రావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ వేడుకకు వచ్చి తన కొడుక్కి ‘బ్రూస్ లీ’ లాంటి డిజాస్టర్ ఇచ్చిన వైట్ల గురించి చిరు ఏం మాట్లాడతాడన్నది ఆసక్తికరం. అసలాయన ‘బ్రూస్ లీ’ ప్రస్తావన తెస్తాడో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English