తేజస్వి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందట

 తేజస్వి ఓ రేంజ్‌లో రెచ్చిపోయిందట

చిన్న సినిమాలతో బిజీగా వుంటోన్న తేజస్వి 'బాబు బాగా బిజీ' చిత్రంలో ఒక హీరోయిన్‌గా నటించింది. అడల్ట్‌ కామెడీ అయిన ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్‌ సెక్స్‌ ఎడిక్ట్‌గా నటిస్తున్నాడు. ఇందులో అతడు మోహించే ఒక యువతిగా తేజస్వి నటించింది.

ఇందులో వున్న హీరోయిన్లు అందరిలోను తేజస్వితోనే శృంగార సన్నివేశాలు ఎక్కువగా వున్నాయట. మిగతా హీరోయిన్లు మరీ హాట్‌గా నటించడానికి వెనకాడినా కానీ తేజస్వి మాత్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా క్యారెక్టర్‌కి అనుగుణంగా నటించిందట. శృంగార సన్నివేశాలకి కానీ, ముద్దు సీన్లకి కానీ, ఎక్స్‌పోజింగ్‌కి కానీ ఆమె అభ్యంతరం చెప్పలేదట. తేజస్వి సన్నివేశాలన్నీ యథాతథంగా సెన్సార్‌ కత్తెరకి గురి కాకుండా బయటకి వస్తే మాత్రం సంచలనం అవుతాయని అంటున్నారు.

బాలీవుడ్‌లో హంటర్‌ చిత్రానికి సెన్సార్‌ ఇబ్బందులేమీ ఎదురు కాలేదు కానీ తెలుగులో మరీ ఈస్థాయిలో మెయిన్‌ స్ట్రీమ్‌లో సెక్స్‌ ప్రధాన చిత్రాలు రావు. మరి ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఎలాంటి అభ్యంతరాలు చెబుతుందో ఏమిటో చూడాలి. ఈ చిత్రం ట్రెయిలర్‌కి వస్తోన్న స్పందనని బట్టి విడుదలైతే కాసుల పంట పండుతుందని నిర్మాతలు ధీమాగా వున్నారు. ఈ చిత్రం అడల్ట్‌ కామెడీల ట్రెండుని ఇంకో లెవల్‌కి తీసుకెళుతుందని కూడా ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English