కాజల్‌ ఫిక్స్‌డ్‌ రేట్‌

కాజల్‌ ఫిక్స్‌డ్‌ రేట్‌

'పక్కా లోకల్‌' పాటలో కాజల్‌ రేపిన సెగలు 'జనతా గ్యారేజ్‌' విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ పాట అంతగా హిట్‌ అవడంతో కాజల్‌తో మరిన్ని ఐటెమ్‌ సాంగ్స్‌ చేయించాలనే ప్రయత్నం జరుగుతోంది. ఐటెమ్‌ సాంగ్స్‌కి వ్యతిరేకం కాదంటూనే తనతో పాట చేయించుకోవాలంటే మాత్రం కోటి రూపాయలు చెల్లించుకోవాలని కాజల్‌ డిమాండ్‌ చేస్తోంది.

'జనతా గ్యారేజ్‌' టైమ్‌లో ఫ్లాప్స్‌లో వుండబట్టి ఆ పాట చేయడానికి రిబేట్‌లో ఓకే చెప్పిన కాజల్‌ 'ఖైదీ నంబర్‌ 150'తో డిమాండ్‌ పెరగడంతో ఈసారి చీప్‌గా సాంగ్‌ చేయనంటోంది. హీరోయిన్‌ క్యారెక్టర్‌ అయినా, ఐటెమ్‌ సాంగ్‌ అయినా కానీ ఫిక్స్‌డ్‌ రేట్‌ అంటూ కాజల్‌ నిర్మాతలని కంగారు పెడుతోంది.

పక్కా లోకల్‌ పాట అంతగా హిట్‌ అయినా, ఆ తర్వాత అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు పాటలో రెచ్చిపోయినా కాజల్‌తో ఇంకెవరూ ఐటెమ్‌ సాంగ్‌ చేయకపోవడానికి కారణమిదే. బెల్లంకొండ సురేష్‌ తన తనయుడి చిత్రం కోసం కాజల్‌తోనే పాట చేయించుకుందామని అనుకున్నాడట. కానీ ఆమె కోటి అడిగేసరికి క్యాథరీన్‌తో సరిపెట్టేసాడు. ఫ్లాప్స్‌లో వున్నపుడు తనంతట తానుగా పారితోషికం తగ్గించుకున్న కాజల్‌ ఒక్క హిట్‌ పడగానే చెట్టెక్కి కూర్చుంది. ఈ ఫీల్డ్‌ ఎలా ఆపరేట్‌ అవుతుందనేది ఆమె బాగానే పసిగట్టేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు