బాలకృష్ణతో హిట్టిస్తే చిరంజీవితో పక్కా

బాలకృష్ణతో హిట్టిస్తే చిరంజీవితో పక్కా

మెగా ఫ్యామిలీలోని స్టార్‌ హీరోలందరినీ డైరెక్ట్‌ చేసిన పూరి జగన్నాథ్‌కి తన అభిమాన కథానాయకుడు చిరంజీవిని డైరెక్ట్‌ చేయలేకపోయాననే వెలితి అలాగే వుండిపోయింది. ఆటోజానీ చిత్రం వర్కవుట్‌ కాకపోవడంతో ఒకింత నిరాశ చెందిన పూరి జగన్నాథ్‌ మళ్లీ చిరంజీవిని కలిసి మరో కథ సిద్ధం చేస్తున్నట్టు చెప్పాడట.

బాలకృష్ణతో చేస్తోన్న సినిమా కథ ఏమిటని అడిగి తెలుసుకుని 'కథ బాగుంది' అని చిరు మెచ్చుకున్నారట. బాలయ్యతో సినిమా విజయవంతమైతే వెంటనే చిరంజీవితో ఓకే అవుతుందని పూరి జగన్నాథ్‌ ధీమాగా వున్నాడు. చిరంజీవి కోసమని అతనో పవర్‌ఫుల్‌ క్యారెక్టరైజేషన్‌ రాసుకున్నాడట. ఆ కథ మీద వర్క్‌ చేసి చిరంజీవి-సురేందర్‌ల చిత్రం తర్వాత పట్టాలెక్కించాలని పూరి భావిస్తున్నాడు.

వెంకటేష్‌తో చేసే సినిమా పక్కన పడేయలేదని, అది కూడా తప్పకుండా వుంటుందని అతను అంటున్నాడు. దానికి తగ్గట్టుగా బడ్జెట్‌, ప్రొడ్యూసర్‌ అన్నీ సెట్‌ అయితే సెట్స్‌ మీదకి వెళుతుందని, ఆ కథని వేరే ఎవరికీ ఇవ్వడం లేదని పూరి స్పష్టం చేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు