కాటమరాయుడుని మీడియానే తొక్కేసింది

కాటమరాయుడుని మీడియానే తొక్కేసింది

ఈ మాట అంటున్నది మరెవరో కాదు, కాటమరాయుడు చిత్రాన్ని ఓవర్సీస్‌లో రిలీజ్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్‌. లోకల్‌గా కాటమరాయుడుకి మంచి ఓపెనింగ్స్‌ వచ్చినప్పటికీ ఓవర్సీస్‌లో మాత్రం బాగా స్ట్రగుల్‌ అవుతోంది. ముక్కీ, మూలిగీ మొదటి వారాంతానికి ఈ చిత్రం మిలియన్‌ డాలర్లని వసూలు చేసింది.

మరో మిలియన్‌కి పైగా వసూలయితే తప్ప డిస్ట్రిబ్యూటర్‌ సేఫ్‌ అయ్యే పరిస్థితి లేదనేది ట్రేడ్‌ రిపోర్ట్‌. లోకల్‌గా బాగా ఆడుతోన్న సినిమా ఓవర్సీస్‌లో అండర్‌ పర్‌ఫార్మ్‌ చేయడానికి మీడియాలోని ఒక వర్గమే కారణమని, వ్యక్తిగత కక్షలతో, రాజకీయ పరమైన కారణాలతో ఈ చిత్రాన్ని తొక్కేసారని అతను ఆరోపిస్తున్నాడు.

అయితే అతడికి అర్థం కాని విషయం ఏమిటంటే ఈ జోనర్‌ సినిమాలకి ఓవర్సీస్‌లో ఆదరణ తక్కువ. చిరంజీవి రీఎంట్రీ కనుక 'ఖైదీ నంబర్‌ 150'కి సాదర స్వాగతం లభించింది కానీ రచ్చ, నాయక్‌లాంటి సినిమాలు ఇక్కడ హిట్‌ అయినట్టుగా ఓవర్సీస్‌లో క్లిక్‌ అవలేదు. సినిమా ఎలా వున్నప్పటికీ, రివ్యూస్‌తో పని లేకుండా ప్రీమియర్‌ షోస్‌ గ్రాస్‌ అయినా రికార్డు స్థాయిలో నమోదవ్వాలి. కానీ ప్రీమియర్లకి ఈ చిత్రానికి కనీసం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌కి వచ్చిన వసూళ్లు కూడా రాకపోవడాన్ని బట్టే జనాల్లో దీనిపై ఆసక్తి అంతగా లేదనేది స్పష్టమవుతోంది.

అయితే తమ నష్టాలకి ఎవరో ఒకరిని బాధ్యుల్ని చేసి చూపించడానికి రివ్యూలపై పడ్డట్టున్నారు. నాసిరకం సినిమా తీసి ఎక్కువ డబ్బులకి అంటగట్టారంటూ నిర్మాతని నిలదీస్తే నష్టాల్లో కొంతయినా భర్తీ అవుతుంది కానీ ఇలాంటి బేస్‌లెస్‌ ఆరోపణల వల్ల ఉపయోగమేంటనేది సగటు సినీ జీవి కామెంట్‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు