కీర‌వాణి అభిమానుల‌కు గుడ్ న్యూస్

కీర‌వాణి అభిమానుల‌కు గుడ్ న్యూస్

2016 డిసెంబ‌రు 9వ‌ తారీఖున తాను రిటైర‌వ‌బోతున్న‌లీర‌ట‌ట్లుగా మూడేళ్ల కింద‌టరెండ‌మ‌ే ప్ర‌క‌టించి అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చాడు కీర‌వాణి.  1989 డిసెంబరు 9న చెన్నైలో తన తొలి పాట రికార్డింగ్ జరిగిందని.. 2016లో అదే తేదీన తాను సంగీత దర్శకుడిగా సినిమాలు మానేయబోతున్నానని.. ఈ విషయంలో పునరాలోచన కూడా ఉండదని అప్పట్లో చెప్పారు కీరవాణి. ఐతే ఆ డేట్ దాటిపోయింది. ఆ త‌ర్వాత కూడా కీర‌వాణి త‌న సంగీత ప్ర‌స్థానాన్ని కొన‌సాగించాడు.

ఐతే అ తేదీ లోపు క‌మిటైన సినిమాల్ని పూర్తి చేసి.. ఆ త‌ర్వాత రిటైర్మెంట్ తీసుకోవ‌చ్చ‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. బాహుబ‌లి-2నే ఆయ‌న చివ‌రి సినిమా కావ‌చ్చ‌ని కూడా భావించారు. ఆదివారం మ‌ధ్యాహ్నం ట్విట్ట‌ర్లో చాలా ఎమోష‌న‌ల్‌గా ట్వీట్ల వ‌ర్షం కురిపించిన కీర‌వాణి రిటైర్మెంట్ గురించి ప్ర‌క‌ట‌న చేసేలా క‌నిపించారు. సాయంత్రం త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తాన‌ని కూడా అన్నారాయ‌న‌.

అన్న‌ట్లే సాయంత్రం 5.30కి ప్ర‌క‌ట‌న చేసేశారు కీర‌వాణి. తాను రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించారాయ‌న‌. సినిమాల్లో కొన‌సాగుతాన‌ని.. ఐతే అది త‌న అభీష్టానికి త‌గ్గ‌ట్లు మాత్ర‌మే ప‌ని చేస్తాన‌ని అన్నారు. తాను కొన‌సాగాల‌ని కోరుకున్న వాళ్లంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. చాలా కొద్ది మంది మిన‌హాయిస్తే.. త‌న భార్య స‌హా అంద‌రూ తాను సినిమాల్లోనే కొన‌సాగాల‌ని కోరుకున్న‌ట్లుగా కీర‌వాణి ముందే చెప్పారు. ఐతే ఇక‌పై త‌న సంగీతానికి త‌నే బాస్ అని.. ద‌ర్శ‌కుల మాట కూడా వినేది లేదు అన్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించారు.