బిజినెస్‌లోకి దిగిన పవన్‌ హీరోయిన్‌

బిజినెస్‌లోకి దిగిన పవన్‌ హీరోయిన్‌

'అమ్మో బాపుగారి బొమ్మో' అంటూ పవన్‌తో పొగిడించుకున్న ప్రణీత సుభాష్‌కి 'అత్తారింటికి దారేది' తర్వాత కెరియర్‌లో ఆశించిన ప్రోగ్రెస్‌ కనిపించలేదు. ఒకటి రెండు పెద్ద చిత్రాల్లో నటించింది కానీ ప్రణీతకి హీరోయిన్‌గా సక్సెస్‌ రాలేదు. తెలుగుతో పాటు దక్షిణాదిలో మరికొన్ని భాషల్లోను నటించిన ప్రణీత ఇండస్ట్రీలో సంపాదించిన దానిని వ్యాపారంలో ఇన్‌వెస్ట్‌ చేసి సెటిల్‌ కావాలని చూస్తోంది.

మామూలుగా హీరోయిన్లు రియల్‌ ఎస్టేట్‌ లేదా వస్త్ర దుకాణాల్లో పెట్టుబడి పెడుతుంటారు. కానీ ప్రణీత వెరైటీగా పబ్‌ పెట్టింది. 'బూట్‌లెగ్గర్‌' పేరుతో బెంగళూరులో ఆమె ఒక పబ్‌ స్టార్ట్‌ చేసింది. పాత కాలం అభిరుచులకి తగ్గట్టుగా ఈ పబ్‌ని వింటేజ్‌ స్టయిల్లో డిజైన్‌ చేయించుకుందట. ఇతర పబ్స్‌ కంటే తమది చాలా చీప్‌ అని, అది యువతని ఆకట్టుకుంటుందని ప్రణీత అంటోంది. ఇది కనుక విజయవంతమైతే దీని బ్రాంచ్‌లని హైదరాబాద్‌, చెన్నయ్‌లో కూడా పెట్టే ఆలోచన వుందని చెప్పింది.

సినీ అవకాశాల కోసం పరుగులు తీయడం లేదని, మంచి ఆఫర్లు వస్తే నటిస్తానని, లేదంటే బిజినెస్‌ చూసుకుంటానని ప్రణీత తెలియజేసింది. ఆమె వ్యాపారంలో రాణించి పెద్ద లెవల్‌కి చేరుకోవాలని కోరుకుంటూ విషెస్‌ అందిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు