బాహుబలి-2లో కొత్త క్యారెక్టర్ అతడిదే..

బాహుబలి-2లో కొత్త క్యారెక్టర్ అతడిదే..

'బాహుబలి: ది బిగినింగ్’లో కాలకేయుడి క్యారెక్టర్ ఎంత హైలైట్ అయ్యిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాత్రతో ప్రభాకర్ విపరీతమైన పాపులారిటీ సంపాదించాడు. ఐతే కాలకేయ క్యారెక్టర్ తొలి భాగంలోనే అంతమైపోయింది. మరి ‘ది కంక్లూజన్’లోనూ అలాంటి ఓ ప్రత్యేక పాత్ర జనాలు ఆశిస్తారనడంలో సందేహం లేదు. అందుకోసమే సుబ్బరాజును లైన్లోకి తెచ్చినట్లున్నాడు రాజమౌళి. మొన్న ‘ది కంక్లూజన్’ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సుబ్బరాజు ప్రత్యక్షమైనపుడు.. ఇతడికి ఇక్కడేం పని అని అందరూ సందేహించారు. ‘ది కంక్లూజన్’లో కొత్త క్యారెక్టర్లేమీ లేవని జక్కన్న అన్నాడు కదా.. మరి సుబ్బరాజుకు ఛాన్స్ ఇచ్చాడా అని డౌట్ కొట్టింది.

మరి బాహుబలి-2లో సుబ్బరాజు ఉన్నట్టా లేనట్టా అనుకుంటుండగా.. ‘ది కంక్లూజన్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో దీనికి బదులిచ్చేశాడు సుబ్బరాజు. ఈ చిత్రంలో తాను నటిస్తున్నట్లుగా అతను కన్ఫమ్ చేశాడు. తనకు కీలక పాత్ర ఇచ్చినందుకు.. తనను కూడా ఇలాంటి అద్భుత చిత్రంలో భాగం చేసినందుకు రాజమౌళికి రుణపడి ఉంటానని అతనన్నాడు. ‘ది బిగినింగ్’లో కాలకేయ తరహాలోనే ‘ది కంక్లూజన్’లో సుబ్బరాజుది ప్రత్యేక పాత్ర అని అంటున్నారు. ఒకప్పుడు బిజీ ఆర్టిస్టుగా ఉన్న సుబ్బరాజు.. కొంత కాలంగా లైమ్ లైట్లో లేడు. అతడికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఇలాంటి టైంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ లాంటి సినిమాలో ఛాన్స్ అంటే మళ్లీ అతడి కెరీర్ ఊపందుకునే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు