ఏం కాలేదు బ్రదర్‌... బన్నీ బాగున్నాడు

ఏం కాలేదు బ్రదర్‌... బన్నీ బాగున్నాడు

అల్లు అర్జున్‌ ఈమధ్య బయట కనిపించినపుడు ఫేస్‌కి మాస్క్‌ ధరించి కనిపించాడు. అల్లు అర్జున్‌ అలా ముఖం దాచుకునే సరికి మీడియా దాని మీదో స్టోరీ రాసేసింది. అల్లు అర్జున్‌కి స్కిన్‌ అలర్జీ వచ్చిందని, అతని ముఖమ్మీద రాషెస్‌ వచ్చాయని, అంచేత ముఖం కప్పుకుని తిరుగుతున్నాడని స్టోరీ అల్లేసింది.

ఒకరు పుట్టించిన పుకారుని వేరే వాళ్లు క్యారీ చేసేసారు. 'దువ్వాడ జగన్నాధమ్‌' షూటింగ్‌ ఆగిపోయిందని, బన్నీ కోలుకోవడానికి టైమ్‌ పడుతుంది కనుక ఆ చిత్రం రిలీజ్‌ కూడా వాయిదా పడుతుందని మసాలా దట్టించారు. అయితే అలాంటిదేమీ లేదని తెలిసింది.

బన్నీ నిక్షేపంగా వున్నాడని, దువ్వాడ జగన్నాథమ్‌ షూటింగ్‌ సజావుగా సాగుతోందని సోర్సెస్‌ ద్వారా సమాచారం అందింది. రెండు రోజులు ఆరోగ్యం బాగోకపోవడంతో, పొల్యూషన్‌ సోకకుండా మాస్క్‌ ధరించమని డాక్టర్‌ చెప్పారట. దాంతో బయటకి వచ్చినపుడు మాస్క్‌ వేసుకున్నాడట. దానికే అలర్జీ వచ్చేసిందని మీడియా సొంత కథ అల్లేసిందన్నమాట. ప్రస్తుతానికి డిజె రిలీజ్‌ పరంగా ఎలాంటి తేడా లేదని, మే 19న విడుదల చేయడానికే ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు