ఆ డైరెక్టర్‌ తనతో పడుకోమన్నాడు, చచ్చాడు!

ఆ డైరెక్టర్‌ తనతో పడుకోమన్నాడు, చచ్చాడు!

హీరోయిన్లు తమ చేదు అనుభవాలని మీడియాతో షేర్‌ చేసుకోవడం ఈమధ్య మామూలైపోయింది. దర్శకులు, హీరోలు, నిర్మాతలు సెక్సువల్‌ ఫేవర్స్‌ అడిగిన విషయాలని ఇప్పుడు కొందరు నటీమణులు ఏమాత్రం భయపడకుండా మీడియాతో షేర్‌ చేసుకుంటున్నారు.

వరలక్ష్మి శరత్‌కుమార్‌ తర్వాత 'నచ్చావులే' ఫేమ్‌ మాధవీలత కూడా తనకి ఎదురైన చేదు అనుభవాన్ని వివరంగా చెప్పుకుంది. తాజాగా 'వేదం' చిత్రంలో మనోజ్‌కి జంటగా నటించిన లేఖా వాషింగ్టన్‌ కూడా తనని ఒక దర్శకుడు ఏ విధంగా టార్చర్‌ పెట్టాడో చెప్పుకుంది. ఒక తమిళ సినిమాలో తనకి అవకాశమిస్తానని వెంట తిప్పుకునేవాడని, అయితే రిటర్న్‌లో తనకేం ఇస్తావని అడిగేవాడని, అతని ఆంతర్యం అర్థమై 'నేను నీతో పడుకునేది లేదు' అని తేల్చి చెప్పానని, దాంతో అతడు వేరే హీరోయిన్‌ని తీసుకున్నాడని, అయితే అదే సినిమా షూటింగ్‌ కోసం విదేశాలకి వెళ్లిన దర్శకుడు వయాగ్రా ఓవర్‌డోస్‌ వల్ల హార్ట్‌ ఎటాక్‌కి గురయి చనిపోయాడని లేఖ చెప్పింది.

కర్మ ఎవరినీ విడిచిపెట్టదని, అతనికి తగిన శాస్తి జరిగిందని ఆమె అంటోంది. స్టార్‌ హీరోయిన్లు కాకుండా ప్రస్తుతం పెద్దగా ఫామ్‌లో లేని హీరోయిన్లు మాత్రమే ఇలాంటివి చెబుతున్నారు. ఇప్పుడు లీడింగ్‌లో వున్న తారలు ఇలాంటివి షేర్‌ చేసుకుంటే ఇండస్ట్రీ షేక్‌ అయిపోతుందేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు