టాలీవుడ్‌లో అందరూ బుర్ర లేని డైరెక్టర్లే

టాలీవుడ్‌లో అందరూ బుర్ర లేని డైరెక్టర్లే

బాహుబలి తర్వాత రిటైర్‌ అయిపోతానని ప్రకటించిన కీరవాణి అదే ఆలోచనతో ఉన్నట్టు ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది. రిటైర్‌ అయిపోవాలనేది పూర్తిగా తన నిర్ణయం అయినప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ శాతం బ్రెయిన్‌లెస్‌ డైరెక్టర్లు వున్నారని, ఇలాంటి వారితో పని చేయడం కష్టమని ఆయన పేర్కొనడం విశేషం. కథ వింటున్నప్పుడే ఒక సినిమా ఫలితమేంటనేది తాను ఊహించగలనని, అయితే తను ఎంత చెప్పినా కొందరు దర్శకుల వినే వారు కాదని, వారికి బుర్ర లేదని ఆయన కామెంట్‌ చేసారు.

రాజమౌళికి ప్యాషన్‌ ఉన్నంత కాలం ఎంతో ఎత్తుకి ఎదుగుతూనే వుంటాడని, అతడితో కూడా ఎప్పటికీ తాను పని చేయలేనని, రిటైర్‌ కాక తప్పదని అన్నారు. కెరియర్లో ఎన్నో చెత్త చిత్రాలకి పని చేసానని, కుటుంబాన్ని పోషించడం కోసం వచ్చిన ప్రతి సినిమా చేయక తప్పలేని చెప్పుకున్నారు. రాఘవేంద్రరావు పెళ్లిసందడి లాంటి చిత్రాలు చేయాలని కీరవాణి అభిలషించారు.

ఇంకా రిటైర్‌మెంట్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ పని చేసినా కానీ తనపై అజమాయిషీ చేసే దర్శకులతో చేయనని, తనకి తానే బాస్‌నని, దానికి ఒప్పుకున్న వారితోనే పని చేస్తానని కీరవాణి పేర్కొన్నారు. పెద్దాయన రిటైర్‌ అయిపోవాలంటే అయిపోక ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని కీరవాణి చేసిన వ్యాఖ్యలు చదివిన వారు అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు