‘బాహుబలి-2’ వేడుక అక్కడ కాదు బాబులూ..

‘బాహుబలి-2’ వేడుక అక్కడ కాదు బాబులూ..

‘బాహుబలి: ది కంక్లూజన్’ ఆడియో వేడుకను ముందు విశాఖపట్నంలో చేయాలనుకున్నారు. కానీ తర్వాత మనసు మార్చుకుని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చేయడానికి నిర్ణయించారు. ఫిలిం సిటీ అనగానే అందరిలోనూ ఒక రకమైన ఎగ్జైట్మెట్ కలిగింది. నాలుగేళ్లుగా ‘బాహుబలి’ షూటింగ్ జరిగిన ప్రదేశంలోనే ఆడియో వేడుక చేస్తూ అక్కడికి అభిమానుల్ని తీసుకెళ్లబోతున్నారా అని ఎగ్జైటయ్యారు. అభిమానులకు.. మీడియాకు ఇది గొప్ప అవకాశంగా భావించారు.

కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ ఆడియో వేడుకను ఫిలిం సిటీ లోపల చేయట్లేదు. అసలీ వేడుక ప్రాంగణం ఫిలిం సిటీ ప్రాంగణంలోకే రాదు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే హైవేలో.. ఫిలిం సిటీ మెయిన్ గేట్ ఉంటుంది. ఫిలిం సిటీకి వెళ్లడానికి ఇదే దారి అని చూపించడానికి అక్కడో ప్రాంగణం.. పెద్ద ఆర్చి ఉంటుంది. అక్కడే ఆడియో వేడుక కోసం పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మళ్లీ ఫిలిం సిటీకి వెళ్లాలంటే ఇంకో పది కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ఫిలిం సిటీ లోపల వేడుక చేయడమంటే అంత సులువైన విషయం కాదు. అక్కడికి ఎంట్రీ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాలి. కేవలం ఆడియో వేడుక వరకే అభిమానుల్ని తీసుకెళ్లి.. తీసుకురావడం అయ్యే విషయం కాదు. అక్కడంతా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.

అందుకే మెయిన్ రోడ్‌కు దగ్గర్లో ఒక సెటప్ రెడీ చేశారు. ఈ మాత్రం దానికి ఫిలిం సిటీలో ఆడియో వేడుక అని చెప్పడం దేనికి.. దాని బదులు ఏ శిల్ప కళా వేదికలోనో ఫంక్షన్ పెట్టేస్తే పోలా అనిపించవచ్చు. ఐతే ఇక్కడ ఆడియో వేడుక చేస్తే జనాల్ని కంట్రోల్ చేయడం అంత సులువు కాదు. లేని పోని తలనొప్పులుంటాయి. కెపాసిటీ తక్కువ. జనాలు ఎక్కువగా వస్తే ఇబ్బంది.

ఏదైనా మైదానాల్లో పెట్టినా జనాల్ని కంట్రోల్ చేయడం కష్టం. ఏర్పాట్ల కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే నగరానికి 30 మీటర్ల దూరంలో వేడుక చేస్తున్నారు. అంత దూరం కాబట్టి అందరూ అంత ఉత్సాహం చూపించకపోవచ్చు. మరీ తక్కువ మంది లేకుండా ఓ పది పదిహేను వేల మందితో ఆడియో వేడుకను కొంచెం గ్రాండ్‌‌గానే ఏ ఇబ్బందీ లేకుండా పూర్తి చేయొచ్చు. ఇదీ బాహుబలి టీం ప్లాన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు