అక్కడ కాటమరాయుడికి పెద్ద షాకే

అక్కడ కాటమరాయుడికి పెద్ద షాకే

అమెరికాలో తెలుగు ప్రేక్షకుల టేస్టు కొంచెం భిన్నంగా ఉంటుంది. వాళ్లు మాస్ మసాలా సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించరు. కొత్తదనం ఉన్న చిత్రాలకే పట్టం కడతారు. కుటుంబ కథా చిత్రాలకు.. ఎంటర్టైనర్లకు ప్రాధాన్యమిస్తారు. ఐతే పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినపుడు మాత్రం ఈ ప్రయారిటీస్ పక్కకు వెళ్లిపోతుంటాయి. అక్కడ మంచి మార్కెట్ ఉంది పవర్ స్టార్‌కు. అతడి సినిమా వచ్చిందంటే అక్కడ కూడా జనాలు ఊగిపోతుంటారు. ఈ క్రేజ్ చూసే పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ను ఏకంగా 250కి పైగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ‘బాహుబలి’ని పక్కనబెట్టేస్తే ఇది బిగ్గెస్ట్ టాలీవుడ్ రిలీజ్ అక్కడ.

అంత పెద్ద స్థాయిలో రిలీజ్ చేసినపుడు కలెక్షన్లు కూడా అందుకు తగ్గట్లే ఉంటాయని అనుకున్నారంతా. కానీ ప్రిమియర్లు.. ఫస్ట్ డే కలిపితే ఈ చిత్రం 6.6 లక్షల డాలర్లే వసూలు చేసింది. ఈజీగా మిలియన్ డాలర్ మార్కును టచ్ చేసేస్తుందనుకున్న సినిమా 6.6 లక్షల డాలర్లకే పరిమితం కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పోయినేడాది ఇంతకంటే తక్కువ థియేటర్లలో రిలీజై 8 లక్షల డాలర్లకు పైగా వసూలు చేసింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ అయితే సంక్రాంతికి ఇంకో రెండు సినిమాలతో పోటీ పడ్డా కూడా ప్రిమియర్లు, ఫస్ట్ డే కలిపి మిలియన్ డాలర్ల దాకా వసూలు చేసింది. మహేష్ సినిమా ‘బ్రహ్మోత్సవం’ డిజాస్టర్ టాక్‌తోనూ ప్రిమియర్లు, ఫస్ట్ డే కలుపుకుని 9 లక్షల డాలర్ల దాకా వసూలు చేసింది. ఈ లెక్కన చూస్తే పవన్ సినిమాకు పూర్ కలెక్షన్స్ వచ్చినట్లే. రొటీన్ ఎంటర్టైనర్ కావడంతో ఈ సినిమాపై అక్కడి జనాలు అంతగా ఆసక్తి చూపించినట్లు లేదు. మరి ఈ చిత్రంపై భారీగా పెట్టుబడి పెట్టిన యుఎస్ డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి ఏమవుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు