కాటమరాయుడు బాధితులని ఆదుకునేదెవరు?

కాటమరాయుడు బాధితులని ఆదుకునేదెవరు?

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో నష్టపోయిన బయ్యర్లకి హెల్ప్‌ అవుతుందని 'కాటమరాయుడు' తీస్తున్నామన్నారు. అయితే సర్దార్‌తో నష్టపోయిన వారిలో అందరికీ న్యాయం జరగలేదని 'నిరాహారదీక్ష'లని బట్టి అర్థమవుతోంది. ఆ సినిమాతో నష్టపోయి, ఈ సినిమా కొనలేని పరిస్థితుల్లో వున్నవారికి రైట్స్‌ ఇవ్వలేదట. 'సర్దార్‌'తో నష్టపోయిన కొందరికి మాత్రం 'కాటమరాయుడు' రైట్స్‌ దక్కాయి.

 అయితే ఈ చిత్రానికి ఇప్పుడు వినిపిస్తోన్న టాక్‌ని బట్టి ఓపెనింగ్‌ వచ్చినా రికవరీ కష్టమని ట్రేడ్‌ వర్గాలంటున్నాయి. అల్టిమేట్‌గా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అంచనా వేస్తున్నాయి. అదే జరిగిన పక్షంలో 'కాటమరాయుడు' బాధితుల కోసం మరో సినిమా చేస్తారా? బయ్యర్లకి హెల్ప్‌ అవడం కోసమని ఈ చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో ప్లాన్‌ చేసారు.

టెక్నీషియన్లలో ఎవరినీ పేరున్న వాళ్లని తీసుకోలేదు. పవన్‌ తర్వాత శృతిహాసన్‌కి తప్ప వేరెవరికీ పెద్దగా పారితోషికం ఇచ్చి వుండరు. అంత తక్కువలో చుట్టేసినప్పటికీ సినిమా రైట్స్‌ మాత్రం భారీ స్థాయిలోనే అమ్మారు.
బయ్యర్లని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం బిజినెస్‌ యాభై కోట్ల స్థాయిలో చేయలేదు. పవన్‌ రెగ్యులర్‌ సినిమాల మాదిరిగానే ఎనభై అయిదు కోట్లు రాబట్టారు. మరి ఈ చిత్రాన్ని సర్దార్‌తో నష్టపోయిన వారికి చేసామనడం ఎంతవరకు సబబు? సర్దార్‌కి లాభాలే తప్ప నష్టం రాని నిర్మాతకి మళ్లీ ఈ సినిమాతోను లాభాల పంట పండింది. మరి బయ్యర్ల మాటేమిటి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు