పిల్ల కమెడియన్‌తో స్టార్‌ హీరోయిన్‌

పిల్ల కమెడియన్‌తో స్టార్‌ హీరోయిన్‌

నయనతార ఏది చేసినా సంచలనమే. హీరో ఎవరనేది చూడకుండా కథ నచ్చితే బ్లయిండ్‌గా సంతకం చేసేస్తుందనే పేరు ఆమెకి వుంది. ముఖ్యంగా తమిళ సినీ రంగంలో నయనతార చాలా ప్రయోగాలు చేసింది. స్టార్‌ హీరోలతో, చోటా హీరోలతో సమానంగా సినిమాలు చేసింది. తాజాగా ఒక కమెడియన్‌తో జంట కట్టడానికి నయనతార ఓకే చెప్పడం హాట్‌ టాపిక్‌ అయింది.

కమెడియన్‌ అంటే ఏదో స్టార్‌ ఇమేజ్‌ వున్న సంతానం లాంటి వాడు కాదు. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే సూరి సరసన నటించడానికి నయనతార సై అందనేది కోలీవుడ్‌ న్యూస్‌. దర్శకుడు తనకి కథ చెప్పగానే నయనతార మరో మాట లేకుండా చేస్తున్నానని అనేసిందట. ఆ కథ ప్రకారం ఒక కమెడియన్‌ సరసన స్టార్‌ హీరోయిన్‌ వుంటేనే కరక్ట్‌ అట. అయితే సూరి పక్కన నటించడానికి ఏ స్టార్‌ హీరోయిన్‌ నటిస్తుందనే అనుమానంతో ఆ దర్శకుడు చాలా రోజులు సతమతమయ్యాడట. ఒకరిద్దరిని సంప్రదిస్తే మొహం మీదే తలుపేసారట. ధైర్యం చేసి నయనతారని అప్రోచ్‌ అయిన అతడికి సింగిల్‌ సిట్టింగ్‌లో ఆమెనుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసరికి ఆనందం పట్టలేకపోతున్నాడు. నయనతారని మించిన ప్రొఫెషనల్‌ లేదంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

సూరిలాంటి కమెడియన్‌తో నయనతార నటిస్తుందన్న ఒక్క పాయింట్‌తోనే ఈ చిత్రానికి క్రేజ్‌ విపరీతంగా వచ్చేస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈ చిత్రానికి నయనతార ఎంత ఛార్జ్‌ చేస్తుందో కానీ ఆమె ఎంత అడిగినా నిర్మాతకి వర్కవుట్‌ అయిపోయే క్రేజ్‌ అయితే ఈ చిత్రం తప్పకుండా తెచ్చుకుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు