చిరంజీవికి ముగ్గురు భార్యలు

చిరంజీవికి ముగ్గురు భార్యలు

హెడ్డింగ్ చూసి మరోలా అనుకోకండి. ఇది నిజ జీవితానికి సంబంధించిన విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి చేయబోయే కొత్త సినిమాకు సంబంధించిన విషయం. స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో చిరంజీవి తన కొత్త సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఉయ్యాలవాడ జీవితంలో అనేక ఆసక్తికర మలుపులున్నాయి. ఆ మలుపుల్లో ప్రధానంగా స్వాతంత్ర సమరానికి సంబంధించిన ఘట్టాల్ని తీసుకుని సినిమాను రూపొందిస్తున్నారు.

ఐతే ఈ చిత్రానికి కొంచెం రొమాంటిక్ టచ్ కూడా ఇవ్వనున్నారు. వాస్తవంగా ఉయ్యాలవాడకు ముగ్గురు భార్యలు ఉండటం విశేషం. కాబట్టి రొమాంటిక్ ట్రాక్ కోసం కొత్తగా కల్పనలు జోడించాల్సిన అవసరమేమీ లేదు. ముగ్గురు భార్యలకు సంబంధించి వ్యవహారాల్ని కొంచెం కొంచెం చూపించి.. రొమాన్స్ రసం పండిపోతుంది. కాబట్టి చిరు సరసన ముగ్గురు హీరోయిన్లను చూసేందుకు అవకాశం ఉందన్నమాట.

ఐతే రీఎంట్రీలో చిరుకు ఒక హీరోయిన్ని సెట్ చేయడమే కష్టమైపోతోంది. ‘ఖైదీ నెంబర్ 150’ కోసం చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించి.. చివరికి చరణ్ సరసన మూడు సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్‌ను ఫైనలైజ్ చేశారు. మరి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’లో ముగ్గురు హీరోయిన్ల పాత్రలకు ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. ఈ చిత్రానికి ఆల్రెడీ స్క్రిప్టు పూర్తయింది. ప్రి ప్రొడక్షన్ వర్క్ మొదలైంది ఏప్రిల్ చివర్లో లేదా మేలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు