నిత్య మీనన్‌లో ఇంకో యాంగిల్‌

నిత్య మీనన్‌లో ఇంకో యాంగిల్‌

నటిగా దక్షిణాది అంతటా అభిమానుల్ని సంపాదించుకున్న నిత్య మీనన్‌ తనకి నచ్చిన సినిమాలే చేస్తూ, తనదైన శైలిలో వ్యవహరిస్తుంటుంది. హీరోయిన్లలో ఈ తరహా ఆచరణ చాలా కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తుంది. లావుగా వున్నావంటే బరువు తగ్గనని, తిండి మాననని, ఇలా నచ్చిన వాళ్లతోనే చేస్తానని ఖరాఖండీగా చెప్పేస్తుంది. ఆమె ధోరణి వల్ల ఇటీవల అవకాశాలు తగ్గాయి కానీ నిత్య మీనన్‌లో మార్పేమీ రాలేదు.

మలయాళంలో ఇప్పటికీ అవకాశాలు బాగానే వస్తున్నాయి కనుక సొంత రాష్ట్రంలోనే ఎక్కువ టైమ్‌ వుంటోంది. ఇతర భాషల్లో అవకాశాలు తగ్గడం వల్ల ట్రావెలింగ్‌ టైమ్‌ కలిసి వచ్చిందేమో ఈ గ్యాప్‌లో ఆమె ఒక కథ రాసుకుంది. ఎప్పట్నుంచో దర్శకురాలి అవతారం ఎత్తాలని చూస్తోన్న నిత్య మీనన్‌కి ఇప్పటికి వీలు కుదిరింది. త్వరలోనే ఆమె దర్శకత్వంలో ఒక మలయాళ చిత్రం రూపొందనుంది.

నిత్య డిఫరెంట్‌ ఆలోచనలకి తగ్గట్టు ఈ చిత్రం కూడా డిఫరెంట్‌గా వుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నిత్య మీనన్‌ డైరెక్షన్‌ అంటే డబ్బింగ్‌ సినిమాల నిర్మాతలు కూడా ఈ చిత్రంపై ఒక కన్నేసి ఉంచుతారు. మరి దర్శకురాలిగా నిత్య ఎలాంటి ముద్ర వేస్తుందనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు