హాట్‌ సీన్లు చేయలేదని తేల్చేసిన శ్రీముఖి

హాట్‌ సీన్లు చేయలేదని తేల్చేసిన శ్రీముఖి

టెలివిజన్‌ యాంకర్‌గా బాగా పాపులర్‌ అయిన శ్రీముఖి అడపాదడపా సినిమాల్లో కూడా ముఖ్య పాత్రల్లో కనిపిస్తూ వుంటుంది. నటిగా, యాంకర్‌గా క్లీన్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న శ్రీముఖి 'బాబు బాగా బిజీ'లాంటి అడల్ట్‌ కామెడీలో నటించడానికి అంగీకరించడమే షాకిచ్చింది. ఇందులో హీరో సెక్స్‌ అడిక్ట్‌. కనిపించిన అమ్మాయిలందరితో సెక్స్‌ కావాలని కోరుకుంటాడు. బాలీవుడ్‌లో హిట్‌ అయిన హంటర్‌ అనే చిత్రానికి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో లీడ్‌ రోల్‌ని అవసరాల శ్రీనివాస్‌ పోషిస్తున్నాడు.

శ్రీముఖి ఇందులో చాలా హాట్‌ సీన్లు చేసిందని, ఆమెకి ఈ చిత్రం తర్వాత డిఫరెంట్‌ ఇమేజ్‌ వచ్చేస్తుందని మీడియాలో రకరకాలుగా రాస్తున్నారు. అయితే ఈ వార్తలన్నిటినీ శ్రీముఖి ఖండించింది. అవన్నీ అవాస్తవాలని, తాను అలాంటి సీన్లేమీ చేయలేదని, తన పాత్ర చాలా గౌరవప్రదంగా వుంటుందని, హీరోకి దిశానిర్ధేశం చేసేలాగుంటుందే తప్ప తనపై అభ్యంతరకరమైన సన్నివేశాలుండవని చెప్పింది.

హంటర్‌ చిత్రాన్ని యథాతథంగా రీమేక్‌ చేసినట్టయితే శ్రీముఖికి ఏ పాత్ర ఆఫర్‌ చేసారనేది ఆసక్తికరమే. ఎందుకంటే ఇందులో హీరోయిన్‌తో మినహా మిగిలిన అందరితోను హీరో వేషాలేస్తూనే కనిపిస్తాడు. శ్రీముఖి హీరోయిన్‌ క్యారెక్టర్‌ చేయలేదు కనుక తనకి ఏ క్యారెక్టర్‌ ఇచ్చారో, ఆ సన్నివేశాలు ఎలా చిత్రీకరించారో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు