ఆ స్కామ్‌ మీద కన్నేసిన మోహన్‌బాబు!

ఆ స్కామ్‌ మీద కన్నేసిన మోహన్‌బాబు!

మంచు ఫ్యామిలీ నుంచి ఇటీవల వచ్చిన చిత్రాలు ఫ్లాప్‌ అవడంతో ఎక్కడ మిస్టేక్‌ జరుగుతుందనే దానిపై ఈమధ్యే అంతా కలిసి కూర్చుని చర్చించుకున్నారట. కథల ఎంపికలోనే పొరపాటు జరుగుతోందని గుర్తించిన మోహన్‌బాబు ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు రియలిస్టిక్‌ సినిమాలు తీయాలని డిసైడ్‌ అయ్యారట. నేటి తరం ప్రేక్షకులకి నచ్చే కథాంశాలతో, వాస్తవికతకి అద్దం పట్టే చిత్రాలు చేస్తే సక్సెస్‌ దానంతట అదే వస్తుందనేది ఆయన స్టడీ చేసారట.

అందుకే ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన ఒక కాల్‌ సెంటర్‌ స్కామ్‌పై సినిమా తీయాలని సంకల్పించారట. అమెరికన్‌ సిటిజన్లకి టోకరా వేసి కోట్ల కొద్దీ డబ్బు సంపాదించిన మీరా రోడ్‌ కాల్‌సెంటర్‌ స్కామ్‌ డీటెయిల్స్‌ కోసం మోహన్‌బాబు టీమ్‌ థానే పోలీసులని మీట్‌ అయినట్టు సమాచారం. ఈ విషయాన్ని తెలుగు సినిమా మీడియాకి తెలియనివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ముంబయి మీడియా ద్వారా న్యూస్‌ లీక్‌ అయింది.

అత్యంత ఆసక్తికరమైన అంశం కనుక ఇది కానీ సినిమాగా తీస్తే ఖచ్చితంగా ఆదరణ పొందే అవకాశముంటుంది. అయితే ఈ చిత్రాన్ని విష్ణుతో తీస్తారా లేక మనోజ్‌తో తీస్తారా అనేది చూడాలి. హిందీలో వచ్చిన అక్షయ్‌కుమార్‌ చిత్రం స్పెషల్‌ చబ్బీస్‌ మాదిరి ఆకట్టుకోగల సబ్జెక్ట్‌ ఇది. ఇంతవరకు దీనిపై బాలీవుడ్‌ కూడా దృష్టి పెట్టలేదు. మొత్తానికి పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకున్న మంచు ఫ్యామిలీ రైట్‌ వేలో అడుగులేస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు