మంత్రి అయినా టీవీ షోలు వ‌దల‌నంటున్న స్టార్‌

మంత్రి అయినా టీవీ షోలు వ‌దల‌నంటున్న స్టార్‌

మాజీ స్టార్‌ క్రికెట‌ర్ న‌వ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశాడు. ప‌ంజాబ్‌లో మంత్రి ప‌ద‌వి చేప‌ట్టినప్ప‌టికీ తాను టీవీ షోల్లోనూ కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టంచేశారు. మంత్రి ప‌ద‌వి త‌న టీవీ కెరీర్‌కు అడ్డంకి కాద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. దీంతో ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్ దీనిపై న్యాయ స‌ల‌హా ఇవ్వాల‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌ను కోరారు. గ‌తంలో తాను టీవీ షోలూ చేస్తున్నా.. ప్ర‌జ‌లు ఐదుసార్లు ఎన్నుకున్నార‌ని, ఇప్పుడు మారాల్సిన అవ‌స‌రం ఏంట‌ని సిద్ధూ ప్ర‌శ్నించారు.

ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా పంజాబ్‌లో కాంగ్రెస్ గెలుపొంద‌డంతో  మంత్రిగా సిద్ధూ ప్ర‌మాణం చేసిన విష‌యం తెలిసిందే. పంజాబ్‌లో కాంగ్రెస్ విజ‌యం త‌ర్వాత సిద్ధూకి ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే త‌నకు పెద్ద‌గా ఒత్తిడి లేని మంత్రి ప‌ద‌వి కావాల‌ని, దీనివ‌ల్ల త‌న టీవీ షోలు తాను చేసుకునే వీలు క‌లుగుంద‌ని సిద్ధూ కోరిన‌ట్లు తెలిసింది. క‌పిల్‌శ‌ర్మ కామెడీ షోలో తాను కొన‌సాగాల‌ని అనుకుంటున్న‌ట్లు సిద్ధూ స్ప‌ష్టంచేశారు. దీనిపై ఏం చేయ‌బోతున్నార‌ని సీఎం అమ‌రీంద‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా..."ఆ విష‌యం అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌ను అడ‌గాలి. మంత్రిగా ఉన్న వ్య‌క్తి తాను ఏం చేయాల‌నుకుంటే అది చేయొచ్చా అన్న‌ది ఆయ‌నే చెప్పాలి. అది పూర్తిగా న్యాయ ప‌రిధిలోని అంశం" అని అమ‌రీంద‌ర్ అన్నారు.

ఈ ప‌రిణామంపై మీడియాపై సిద్దూ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. టీవీ షోలూ చేస్తూ.. మంత్రి బాధ్య‌త‌లు స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించ‌గ‌ల‌రా అని సిద్దూని అడిగితే.. గ‌త ప‌న్నెండేళ్ల‌లో ఇలాగే ఆరు ఎన్నిక‌ల్లో గెలిచాను.. ప్ర‌జ‌ల‌కు లేని అభ్యంత‌రం మీడియాకు ఎందుకు? అని ఎదురు ప్ర‌శ్నించారు. అమ‌రింద‌ర్ త‌న‌కు తండ్రిలాంటి వార‌ని చెప్పిన సిద్ధూ.. మంత్రిగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత ఆయ‌న కాళ్లు కూడా మొక్కిన విష‌యం తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English