పవన్‌ ఫాన్స్‌ రిలాక్స్‌, ఒట్టి గాసిప్సే

పవన్‌ ఫాన్స్‌ రిలాక్స్‌, ఒట్టి గాసిప్సే

పవన్‌కళ్యాణ్‌ మరో రీమేక్‌ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని వార్తలు రాగానే పవర్‌స్టార్‌ అభిమానుల గుండెల్లో బాంబులు పడ్డాయి. సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో పవన్‌ ఓ రీమేక్‌ చేయడానికి సంకల్పిస్తున్నాడని మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఏ సినిమా రీమేక్‌ చేస్తున్నాడనేది చెప్పకపోవడంతో విజయ్‌ నటించిన 'తెరి' రీమేక్‌ చేస్తున్నాడంటూ పుకారు పుట్టుకొచ్చింది.

'పోలీసోడు' పేరుతో అనువాదమై దిల్‌ రాజు ద్వారా రిలీజ్‌ అయిన ఆ చిత్రాన్ని పవన్‌ రీమేక్‌ చేయడమేంటని అభిమానులు అనుమానించలేదు. ఎందుకంటే 'వీరమ్‌' కూడా తెలుగులో అనువాదమైనా దానిని పవన్‌ రీమేక్‌ చేసేయడంతో, ఈసారి కూడా ఛాన్సులున్నాయనే నమ్మారు. పవన్‌ ఎందుకిలా అనువాదమైన చిత్రాలని రీమేక్‌ చేస్తున్నాడంటూ అభిమానుల్లో కలకలం రేగింది. పవన్‌ని ట్యాగ్‌ చేస్తూ 'మాకొద్దు ఈ రీమేక్‌లు' అంటూ గోడు విన్నవించుకున్నారు.

అయితే ఇది కేవలం గాసిప్‌ అని, పవన్‌ దృష్టికి అసలు తెరి రీమేక్‌ వెళ్లలేదని, సంతోష్‌ శ్రీనివాస్‌తో ప్రపోజల్‌ వుంది కానీ ఏదీ ఓకే కాలేదని తెలిసింది. త్రివిక్రమ్‌ చిత్రం తర్వాత వేదలామ్‌ రీమేక్‌ చేయడానికి పవన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. దాని తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తోనే సినిమా వుంటుందని టాక్‌ వినిపిస్తోంది. కనుక ఈ తెరి రీమేక్‌ వార్తలు విని ఫాన్స్‌ కంగారు పడనవసరం లేదు. రిలాక్స్‌ అయి కాటమరాయుడు హంగామాతో బిజీ అయిపోండిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు