అత్తారింటికి దారిచ్చిన ఎన్టీఆర్‌

అత్తారింటికి దారిచ్చిన ఎన్టీఆర్‌

అత్తారింటికి వెళ్ళడానికి ఎన్టీఆర్‌ దారివ్వడమేంటనేదేగా సందేహం? ఏమీ లేదండీ, పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా పేరు అత్తారింటికి దారేది అని దాదాపుగా ఖరారైనట్లే. అయితే ఈ సినిమా వస్తున్న టైముకే కరెక్టుగా నందమూరి హీరో కూడా మరో సినిమాతో రంగం సిద్దం చేసుకున్నాడు.

అత్తారింటికి సినిమా ఆగస్టు 7న రీలీజవుతుంటే, ఎన్టీఆర్‌ ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌తో చేస్తున్న 'రామయ్య వస్తావయ్యా' సినిమాను ఆగస్టు 9న విడుదల చేయాలని ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే ప్రొడ్యూసర్లకు అన్యాయం చేయకూడదని ఫీలైన యంగ్‌ టైగర్‌ తన సినిమాను అవసరమైతే వెనక్కి ప్లాన్‌ చేసుకుంటానని మాటిచ్చాడట. అందుకే ఇప్పుడు రామయ్యను ఒక నెల వెనక్కి పంపేసి ఏకంగా సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చెయ్యాలని ఫిక్సయ్యాడు.

పైగా ఈ తారీఖుకు కూడా ఒక విశిష్టత ఉంది. సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం అదే డేటున సూపర్‌హిట్‌ సినిమా 'స్టూడెంట్‌ నెం.1' సినిమా రిలీజయ్యింది. ఆ విధంగా ఎన్టీఆర్‌ పవన్‌ తన అత్తారింటికి వెళ్ళడానికి దారిచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు