గణేష్‌ టార్చర్‌తో పారిపోతున్నారు

గణేష్‌ టార్చర్‌తో పారిపోతున్నారు

ఎవరైనా పెద్ద సినిమాలు వరుసగా తీస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళదగ్గరకు కొత్త దర్శకులు పరిగెడుతూ వస్తారు. కొత్త కొత్త స్టోరీ లైన్లను చెబుతూ ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ రచ్చ చేస్తారు. వీళ్లలో ఎవరో ఒకరు స్టార్‌ దర్శకుడు కూడా అయిపోతారు. కాని ఇలాంటి వాళ్ళందరూ బ్లాక్‌బాస్టర్‌ ప్రొడ్యూసర్‌గా పిలువబడే బండ్ల గణేష్‌ దగ్గరకు వెళ్ళాలంటేనే భయపడుతున్నారు.

 ఎందుకంటే మనోడి టార్చర్‌ మామూలుగా ఉండదట.. సినిమా నువ్వు ఎలా తీస్తావో తెలీదు నాకు మాత్రం బ్లాక్‌బాస్టరే కావాలి అంటూ ముందు నుంచే మనోడు వార్నింగులు ఇస్తాడట. దానితో చాలామంది కొత్తవారు నాలుగు రోజులపాటు గణేష్‌తో స్టోరి సిట్టింగ్‌లు వేసి తరువాత సైడైపోతున్నారట. అందుకే మనోడు హిట్టు కొట్టిన దర్శకుల దగ్గరకు వెళ్లిపోయి అడ్వాన్సులు చేతిలో పెట్టేస్తున్నాడు. ఒక్కసారి మనోడు దిల్‌రాజు దగ్గరకు వెళ్ళి కొత్తవారితో హిట్లు ఎలా తియ్యాలో తెలుసుకుంటే బెటర్‌. లేకపోతే ఫ్యూచర్‌లో ఎవ్వరూ మనోడికి సినిమా చేసే ఛాన్స్‌ ఉండకపోవచ్చు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు