రీమిక్స్‌ రాజా

రీమిక్స్‌ రాజా

పాత హిట్‌ సినిమా పాటలని ఇప్పుడు రీమిక్స్‌ చేసి వదలడం ఫ్యాషన్‌ అయిపోయింది. తన తండ్రి పాటలని వరుసగా రీమిక్స్‌ చేయించుకుంటూ చరణ్‌ మెగా అభిమానుల్ని సంతోషపెడుతున్నాడు. అలాగే చిరంజీవితో పాటు ఇతర హీరోల పాటల్ని కూడా అందరు హీరోలు రీమిక్స్‌ చేసుకుంటున్నారు. అయితే ఈ రీమిక్స్‌ వ్యవహారంలో అందరికంటే ముందున్నాడు అల్లరి నరేష్‌. ఇప్పటికే అతను పలు పాటల్ని రీమిక్స్‌ చేయించుకున్నాడు. చిరంజీవి పాటలు మంచమేసి దుప్పటేసి, అత్తో అత్తమ్మ కూతురోతో పాటు కృష్ణ 'సింహాసనం'లోని 'ఆకాశంలో ఒక తార' పాట అల్లరి నరేష్‌ కోసం రీమిక్స్‌ చేశారు. ఇప్పుడైతే ఏకంగా ఒకే సినిమాలో రెండు రీమిక్స్‌ సాంగ్స్‌తో వచ్చేస్తున్నాడు. 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మా', 'ప్రేమయుద్ధం' చిత్రంలోని 'స్వాతీ ముత్యపు జల్లులలో' పాటల్ని 'యాక్షన్‌' చిత్రంలో రీమిక్స్‌ చేశారు. మిగతా హీరోలు అందరి కంటే రీమిక్స్‌ సాంగ్స్‌ చేయడాన్ని అల్లరి నరేష్‌ ఎక్కువ ఎంకరేజ్‌ చేస్తున్నాడు. అందుకే అతనికి 'రీమిక్స్‌ రాజా' అనే ట్యాగ్‌ తగిలించారు. అయితే స్టార్‌ హీరోలు రీమిక్స్‌ చేసుకున్నప్పుడు వచ్చే క్రేజ్‌ అల్లరి నరేష్‌ పాటలకి మాత్రం రావట్లేదు.. అది వేరే సంగతి.

 

TAGS

Remix Raja

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు