నలభై క్షణాల్లో రచ్చ పీక్స్‌

నలభై క్షణాల్లో రచ్చ పీక్స్‌

'స్వామిరారా' చిత్రంతో నెక్స్‌ట్‌ రాంగోపాల్‌వర్మ అవుతాడనే నమ్మకం కలిగించిన సుధీర్‌ వర్మ రెండో చిత్రం 'దోచేయ్‌'తో ట్రాక్‌ తప్పాడు. వన్‌ సినిమా వండరా అని డౌట్‌ వచ్చేట్టు చేసాడు. అయితే గ్యాప్‌ తీసుకుని ఈసారి 'కేశవ' అనే రివెంజ్‌ థ్రిల్లర్‌తో వస్తున్నాడు.

ఈసారి కూడా నిఖిల్‌నే హీరోగా పెట్టుకున్న సుధీర్‌ వర్మ ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ నుంచీ ఇంప్రెస్‌ చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన నలభై సెకన్ల టీజర్‌ ఒకటి రిలీజ్‌ చేసారు. ఇంటర్నెట్‌లో వైరల్‌ అయిపోయిన ఈ టీజర్‌తో ఒక్కసారిగా 'కేశవ'కి డిమాండ్‌ పెరిగిపోయింది. ట్రేడ్‌ ఎంక్వయిరీలు ఒక రేంజ్‌లో మొదలయ్యాయి. మే 12న రిలీజ్‌ అవ్వబోతున్న ఈ చిత్రం విడుదలకి ముందే పదిహేను కోట్ల బిజినెస్‌ చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

నిఖిల్‌ సూపర్‌ ఫామ్‌లో వుండడం, అతని గత చిత్రం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఘన విజయాన్ని అందుకోవడంతో ఈసారి కూడా అతని లెక్క తప్పదని ట్రేడ్‌ విశ్వసిస్తోంది. దానికి తోడు టీజర్‌ కూడా ఆకట్టుకునే సరికి కేశవ మార్కెట్లో రెడ్‌ హాట్‌ అయిపోయింది. ఇంతకాలం ఈ చిత్రంపై అంచనాలు పెద్దగా లేవు కానీ ఈ టీజర్‌తో బాగా పెరిగాయి. మరి వీటిని అందుకునేలా ఫైనల్‌ అవుట్‌పుట్‌ వుంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు