పవన్ ఆ రోజు ఎందుకలా నవ్వాడంటే..

పవన్ ఆ రోజు ఎందుకలా నవ్వాడంటే..

‘కాటమరాయుడు’ ఆడియో వేడుకలో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతుంటే.. ఆలీ ఏదో అనడం.. పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తుళ్లిపడుతూ పగలబడి నవ్వడం అందరి దృష్టినీ ఆకర్షించింది. పవన్ ఆ రోజు ఎందుకలా నవ్వాడని ఎవ్వరికీ అర్థం కాలేదు. ఈ విషయంలో ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ కూడా నడిచింది.

పవన్ అలా గెంతుతూ నవ్వడం భలే సరదాగా అనిపించింది అందరికీ. ఆలీ ఏదో బూతు జోక్ వేసి ఉంటాడని.. అందుకే పవన్ అలా నవ్వి ఉంటాడని చాలామంది అన్నారు. ఐతే ఆ రోజు అసలేం జరిగింది.. పవన్ ఎందుకు అంతలా నవ్వాడో ఆలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘పవన్ నవ్వు అభిమానుల్లో అంత చర్చకు దారి తీస్తుందని ఊహించలేదు. ఆ రోజు శరత్ మరార్ గారు పవన్ కళ్యాణ్‌ను అదే పనిగా పొగిడారు. ఆయన డ్రెస్సింగ్.. లుక్ గురించి మాట్లాడారు. నేను ఉన్నట్లుండి.. ‘మళ్లీ పెళ్లి గానీ చేస్తాడా ఏంటి’ అన్నాను. పవన్ అది విన్నాడు. నవ్వు ఆపుకోలేకపోయాడు’’ అంటూ అసలు విషయం వెల్లడించాడు ఆలీ. పవన్‌కు ఆలీ అంటే చాలా ఇష్టం. అతడితో అనుబంధం గురించి పవన్ చాలాసార్లు ప్రస్తావించాడు. పవన్ దగ్గర ఏదైనా మాట్లాడగలిగే.. అతడి మీద జోకులు కూడా వేయగలిగేంత చనువు ఆలీకి ఉంది. ‘మళ్లీ పెళ్లా’ అంటూ పవన్ ముందే అతడి మీద జోక్ పేల్చగలిగాడంటే ఆలీ పవన్‌కు ఎంత క్లోజో అర్థం కావట్లేదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు