కావాల్సినంత హైప్ వచిందిగా ఇంక మీడియా ఎందుకులే..

కావాల్సినంత హైప్ వచిందిగా ఇంక మీడియా ఎందుకులే..

మన స్టార్ హీరోలు ఒకప్పుడు మీడియా ముఖమే చూసేవాళ్లు కాదు. కానీ గత కొన్నేళ్లలో ప్రమోషన్ ప్రాధాన్యమేంటో అర్థమయ్యాక అందరిలోనూ మార్పు వచ్చింది. మహేష్ బాబు ఈ విషయంలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తర్వాత తర్వాత మిగతా స్టార్ హీరోలు కూడా ప్రమోషన్లకు మంచి ప్రయారిటీ ఇచ్చారు.

ఐతే ఈ కోవలో చాలా లేటుగా స్పందించింది మాత్రమే పవర్ స్టార్ పవన్ కళ్యాణే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ముందు వరకు పవన్ ఏ సినిమాకూ ప్రి రిలీజ్ ప్రమోషన్లలో పాల్గొన్నది లేదు. ఈ సినిమాకు కూడా మీడియాను వన్ టు వన్ కలిసి ఇంటర్వ్యూలిచ్చాడు తప్ప.. అందరిలో ఒకేసారి విలేకరుల సమావేశం పెట్టలేదు.

ఐతే కనీసం ఇంటర్వ్యూలైనా ఇచ్చాడు అదే మహా ప్రసాదం అనుకుంది మీడియా. ఐతే ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఈ ఇంటర్వ్యూల వల్ల ప్రత్యేక ప్రయోజనం ఏమీ కలగలేదని అనుకున్నాడో ఏమో.. పవన్ తన లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ విషయంలో మీడియాను కలిసే ఉద్దేశమేమీ లేనట్లుగా కనిపిస్తున్నాడు. మొన్నటి ప్రి రిలీజ్ ఈవెంట్‌తో సరిపెట్టేసి.. నేరుగా సినిమాను రిలీజ్ చేసేయాలని పవన్ అండ్ కో భావిస్తోంది.

ఈ సినిమాకు ఇప్పటికే కావాల్సినంత హైప్ రావడంతో ఇక వేరే ప్రమోషన్లేవీ అవసరం లేదని భావిస్తోందట చిత్ర యూనిట్. విడుదలకు ఇంకో మూడు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పవన్ మీడియాను కలిసే అవకాశమే లేదని స్పష్టమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు