మంచు కాంపౌండ్‌లోకి అతను వెళ్లలేదు

మంచు కాంపౌండ్‌లోకి అతను వెళ్లలేదు

ఖైదీ నంబర్‌ 150 తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా డిసైడ్‌ కానీ వినాయక్‌ గురించి సడన్‌గా వార్తలు స్టార్ట్‌ అయ్యాయి. మంచు మనోజ్‌తో అతని మలి చిత్రం వుంటుందనే వార్త విని మనోజ్‌ స్టార్‌ తిరిగిపోతుందని అనుకున్నారు. అయితే వినాయక్‌ తరఫువారు ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేసారు.

మోహన్‌బాబు జన్మదిన వేడుకలకి ఆహ్వానం అందితే వెళ్లి వచ్చిన వినాయక్‌, తిరుగు ప్రయాణంలో మంచు మనోజ్‌తో ఒకే ఫ్లయిట్‌లో వచ్చాడట. దీంతో మనోజ్‌తో వినాయక్‌ మలి చిత్రం చేస్తున్నాడనే వార్తలు పుట్టుకొచ్చాయట. వినాయక్‌ ఇంకా తదుపరి చిత్రంపై నిర్ణయం తీసుకోలేదని, ఇద్దరు స్టార్‌ హీరోల కోసం కథలు సిద్ధం చేయిస్తున్నాడని, ఎవరితో కుదిరితే వారితో ముందుగా చేస్తాడని సమాచారం.

సాయి ధరమ్‌ తేజ్‌తో ఒక చిత్రం చేయాలనే ప్రపోజల్‌ వున్నప్పటికీ అతనికి వేరే కమిట్‌మెంట్స్‌ వుండడంతో ఆ ప్రాజెక్ట్‌ వాయిదా పడిందట. అల్లు అర్జున్‌తో వినాయక్‌ సినిమా సెట్‌ కావచ్చునని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే బన్నీ నెక్స్‌ట్‌ వక్కంతం వంశీతో వుంటుంది కనుక వినాయక్‌తో సెట్‌ అయినా అది మొదలు కావడానికి ఈజీగా మరో ఏడాది సమయం పడుతుంది. అందాకా వినాయక్‌ ఆగుతాడో, వేరే హీరోని చూసుకుంటాడో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు