చరణ్‌ డాడీ అవుతున్నాడనేది రూమరే

చరణ్‌ డాడీ అవుతున్నాడనేది రూమరే

రామ్‌ చరణ్‌ తండ్రి కాబోతున్నాడనే వార్తలు సడన్‌గా కొన్ని వెబ్‌ ఛానల్స్‌లో దర్శనమిచ్చాయి. గాసిప్‌లా కాకుండా నిజంగానే చరణ్‌ తండ్రి అవుతున్నాడని, ఖచ్చితమైన సమాచారం వుందని అన్నట్టుగా ప్రచారం జరిగింది. ఇటు మెగా ఫ్యామిలీ, అటు అపోలో ఫ్యామిలీ ఆనందడోలికల్లో మునిగిపోయినట్టు కూడా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడే పిల్లలు వద్దని చరణ్‌, ఉపాసన ఎప్పుడో నిర్ణయించుకున్నారు.

ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో కష్టపడి బరువు తగ్గించుకున్నానని, ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ అంటూ బరువు పెరగలేనని ఉపాసన చెప్పేసింది. చరణ్‌ కూడా ఇద్దరం యంగ్‌ కనుక కిడ్స్‌ కెన్‌ వెయిట్‌ అనేసాడు. ఈ పుకార్లు ఎటునుంచి పుట్టుకొచ్చాయో అర్థం కాక చరణ్‌ టీమ్‌ వెంటనే అలర్ట్‌ అయి అవన్నీ రూమర్లేనని స్పష్టం చేసాయి. అలాంటి శుభవార్త ఏదైనా వుంటే చరణ్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా బ్రేక్‌ చేస్తాడని, కాబట్టి ఇలాంటి వార్తలు ఏ సోర్స్‌ ద్వారా వచ్చినా నమ్మవద్దని ప్రస్తుతం వచ్చిన పుకార్లకి ఫుల్‌స్టాప్‌ పెట్టేసారు.

బన్నీ ఆల్రెడీ ఇద్దరు పిల్లల తండ్రి కాగా, చరణ్‌ ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటూ అభిమానుల్లో అపుడపుడూ ఈ టాపిక్‌ చర్చకి వస్తుంది. చరణ్‌ మాత్రం కొణిదెల వంశం తర్వాతి తరానికి ఇంకాస్త టైమ్‌ వుందనేస్తున్నాడు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు