చాలా జాగ్రత్తగా ఆచారి అమెరికా యాత్ర

చాలా జాగ్రత్తగా ఆచారి అమెరికా యాత్ర

మంచు విష్ణు మంచి టైటిల్‌తో సినిమా మొదలుపెట్టాడు. ‘ఆచారి అమెరికా యాత్ర’ టైటిల్‌పై మంచి రెస్పాన్స్ వస్తోంది. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆసక్తి రేకెత్తించింది. ‘ఢీ’, ‘దేనికైనా రెడీ’ లాంటి సినిమాల్లో భలేగా పండిన విష్ణు-బ్రహ్మి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాపై అప్పుడే పాజిటివ్ బజ్ మొదలైంది.

విశేషం ఏంటంటే.. ఈ సినిమాకు కథ అందించింది లెజెండరీ రైటర్ మల్లాది వెంకటకృష్ణమూర్తి. ఆయన రాసిన ఓ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ నవలను సినిమాకు తగ్గట్లు మార్చినప్పటికీ ఈ చిత్ర బృందం కథకుడిగా క్రెడిట్ మల్లాదికే ఇస్తుండటం విశేషం. మల్లాది కథతో ఈ సినిమా తెరకెక్కుతుండటం సాహితీ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తించేదే.

ఆటాడుకుందాంరా, ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమాలతో ఎదురు దెబ్బలు తిన్న జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ముగ్గురు రచయితలతో స్క్రీన్ ప్లే రాయించి.. మరో రచయితతో మాటలు రాయించి.. పక్కాగా ఈ స్క్రిప్టును తీర్చిదిద్దుకున్నాడట అతను. ‘విక్రమార్కుడు’ నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి.. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత తన కుమార్తెను ప్రొడ్యూసర్‌గా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం.

‘అధినాయకుడు’ సినిమా తర్వాత ఆయన అడ్రస్ లేకుండా పోయారు. మంచు విష్ణు.. బ్రహ్మిలకు కూడా ఇప్పుడు హిట్టు అత్యవసరం. మొత్తంగా సక్సెస్ అవసరమైన వాళ్లందరూ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు