ఆమెకి బోయపాటి అరకోటి ఇప్పించాడట!

 ఆమెకి బోయపాటి అరకోటి ఇప్పించాడట!

బెల్లంకొండ సురేష్‌ హీరోయిన్లకి మాత్రం బంగారుకొండ అయిపోతున్నాడు. తనయుడిని హీరోగా నిలబెట్టే క్రమంలో స్టార్‌ హీరోయిన్ల సపోర్ట్‌ తీసుకుంటోన్న బెల్లంకొండ సురేష్‌ వారి మార్కెట్‌ రేటుకి మించిన పారితోషికం ఇచ్చి డేట్స్‌ తీసుకుంటున్నాడు.

ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాడని, ఫైనాన్సియర్లతో సమస్యలున్నాయని అతడి గురించి తరచుగా వదంతులు వినిపిస్తుంటాయి కానీ హీరోయిన్లకి పారితోషికాలు ఇచ్చే విషయంలో మాత్రం బెల్లంకొండ ఏమీ తగ్గట్లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతోన్న 'అల్లుడు బంగారం' చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌కి క్యాథరీన్‌ ట్రెసాని తీసుకున్న సంగతి తెలిసిందే. అసలే పెద్దగా అవకాశాలు లేని క్యాథరీన్‌కి ఈమధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల వచ్చే ఛాన్సులు కూడా మిస్‌ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో తనకి వచ్చిన ఈ అవకాశాన్ని ఆమె మిస్‌ చేసుకోకూడదని అనుకుంది. తనకి సరైనోడుతో గుర్తింపు తెచ్చిన దర్శకుడు అడిగేసరికి ఆమె ఐటెమ్‌ సాంగ్‌కి సై అనేసింది. అయితే క్యాథరీన్‌కి ఈ పాటకి 65 లక్షలు ఇప్పించాడట బోయపాటి శ్రీను. మామూలుగా తను పూర్తి సినిమా చేసినా అంత పారితోషికం ఇవ్వరు. కేవలం ఒక్క పాటకే ఆ రెమ్యూనరేషన్‌ ఇచ్చేసరికి క్యాథరీన్‌ ఉబ్బితబ్బిబ్బయిందట. ఈ పాట కానీ క్లిక్‌ అయితే ఇకపై ఐటెమ్‌ గాళ్‌గానే కంటిన్యూ అయినా ఆశ్చర్యం లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English