పవన్‌ క్రేజ్‌ చూసి షాకయిన తమిళ డైరెక్టర్‌

పవన్‌ క్రేజ్‌ చూసి షాకయిన తమిళ డైరెక్టర్‌

'కాటమరాయుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్‌ వుందంటే ఓకే. తమిళనాడులో కూడా ఈ చిత్రానికి పిచ్చ క్రేజ్‌ రావడం చూసి అక్కడి వాళ్లే షాకవుతున్నారు. పోనీ కథ తెలియని కొత్త సినిమాకి ఇలాంటి క్రేజ్‌ వస్తే అనుకోవచ్చు. ఆల్రెడీ అజిత్‌ నటించిన తమిళ చిత్రం 'వీరమ్‌'కి రీమేక్‌ అని తెలిసి కూడా తమిళనాడులో ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. సగటు తమిళ సినీ అభిమానులే కాకుండా కోలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా ఈ క్రేజ్‌ చూసి అవాక్కవుతున్నారు.

ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని 'కాటమరాయుడు' ట్రెయిలర్‌ సూపర్‌గా వుందని కితాబిస్తూ, తమిళనాడులో ఈ చిత్రానికి రికార్డ్‌ రిలీజ్‌ దక్కిందని పవన్‌కి అభినందనలు అందజేసాడు. తమిళనాడులో ఒక తెలుగు సినిమాకి ఇంతటి క్రేజ్‌ తానెప్పుడూ చూడలేదని సముద్రఖని ట్వీట్‌ చేసాడు. ఇదే మాట అతనొక్కడే కాకుండా తమిళనాడుకి చెందిన చాలా మంది ట్వీట్‌ చేస్తున్నారు. తమిళ రీమేక్‌తోనే తమిళనాడులో రికార్డుల వేట మొదలుపెట్టాడంటూ పవన్‌ ఫాన్స్‌ మరింత ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు