సూపర్‌స్టార్‌ మనవరాలి బికినీల రచ్చ

సూపర్‌స్టార్‌ మనవరాలి బికినీల రచ్చ

సెలబ్రిటీల పిల్లలు, మనవలు అనేసరికి మీడియా ఎప్పుడూ వెంటాడేస్తుంటుంది. వారి ప్రవర్తనని స్కాన్‌ చేస్తూ, వారి ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ని ఎనలైజ్‌ చేస్తూ అవసరం లేని ఫోకస్‌ పెడుతుంటుంది.

స్టార్‌డమ్‌తో పాటు వచ్చే ఎక్స్‌ట్రా లగేజ్‌ అని హీరోలు, హీరోయిన్లు కూడా సర్దుకుపోతుంటారు. అయితే ఎలాంటి బట్టలేసుకోవాలి, ఏ విధంగా తమని తాము ప్రెజెంట్‌ చేసుకోవాలనే దానిపై పిల్లలకి ఆంక్షలు పెట్టలేరు కదా. పైగా ఈ సోషల్‌ మీడియా యుగంలో డెయిలీ పిక్టోరియల్‌ అప్‌డేట్స్‌ ఎవరికైనా కామన్‌ అయిపోయాయి. రెండ్రోజులు అప్‌డేట్స్‌ లేకపోతే ఎక్కడ ప్రపంచం తమని మర్చిపోయిందోననే ఆత్మన్యూనత పీడించేస్తుంటుంది.

తెరపైకి రాని సెలబ్రిటీ కిడ్స్‌ విషయంలో ఇది మరీ ఎక్కువగా వుంటోంది. బిగ్‌ బి మనవరాలు నవ్యా నవేలీ నందా కూడా సోషల్‌ మీడియా సెలబ్రిటీ స్టేటస్‌ని ఎంజాయ్‌ చేస్తుంటుంది. తరచుగా తన బికినీ లేదా రివీలింగ్‌ పిక్స్‌ పోస్ట్‌ చేసి రచ్చ చేస్తుంటుంది. తన మనవరాలిని పబ్లిసిటీకి దూరంగా వుంచమని బిగ్‌బి, ఆయన కూతురు కూడా పలుమార్లు మీడియాని రిక్వెస్ట్‌ చేసారు కానీ నవ్య ఇలా రోజూ ఇలా దివ్యంగా అందాల ఆరబోతకి సై అంటూ వుంటే, వచ్చే హిట్లని మీడియా ఎందుకు వదిలేసుకుంటుంది?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు