100 కోట్ల రికార్డ్ అప్పుడే బద్దలైపోయిందా

100 కోట్ల రికార్డ్ అప్పుడే బద్దలైపోయిందా

మొన్ననే ఇండియాస్ హైయెస్ట్ శాటిలైట్ డీల్ అంటూ ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ గురించి ఓ సంచలన వార్త బయటికి వచ్చింది. ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని విడుదలకు ఏడెనిమిది నెలలుండగానే జీటీవీ సొంతం చేసుకుంది. తమిళం.. హిందీ.. తెలుగు భాషలకు కలిపి రూ.110 కోట్లకు శాటిలైట్ డీల్ జరిగినట్లుగా వార్తలొచ్చాయి. ‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఇంకా పెద్ద డీల్సే జరిగినప్పటికీ.. అధికారికంగా మాత్రం తమదే రికార్డని ప్రకటించుకుంది ‘2.0’ చిత్ర బృందం. ఐతే వాళ్లకు ఈ రికార్డు ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు. అమీర్ ఖాన్-అమితాబ్ బచ్చన్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ ఇంకా సెట్స్ మీదికి వెళ్లకముందే అనూహ్యమైన శాటిలైట్ రేటు దక్కించుకుంది.

‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ శాటిలైట్ హక్కుల్ని ‘నెట్స్ ఫిక్స్’ సంస్థ రూ.120 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 8.6 కోట్ల సబ్ స్క్రైబర్లను కలిగి ఉన్న ఇంటర్నెట్ టీవీ ‘నెట్ ఫ్లిక్స్’. ఆ కంపెనీ.. యశ్ రాజ్ ఫిలిమ్స్‌కు ఫ్యాన్సీ రేటు ఇచ్చి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ శాటిలైట్ హక్కుల్ని తీసేసుకుంది. ఆ తర్వాత ఈ సంస్థ హక్కుల్ని మారు బేరానికి అమ్ముకునే అవకాశాల్ని కూడా కొట్టిపారేయలేం.

‘ధూమ్-1’, ‘ధూమ్-2’ సినిమాలకు రచయితగా పని చేసి.. ‘ధూమ్-3’తో దర్శకుడిగా పరిచయమైన విజయ్ కృష్ణ ఆచార్య ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమా కోసం అవతారం మార్చుకునే పనిలో ఉన్నాడు అమీర్. ఇంకో నెల రోజుల్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. 2018లో విడుదలవుతుంది. బ్రిటిష్ కాలంలో ఇండియాలో దారి దోపిడీలు, హత్యలు చేసి దుండగుల కథలో 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్ ఆఫ్ ఎ థగ్’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English