తొలి వెయ్యి కోట్ల సినిమా?

తొలి వెయ్యి కోట్ల సినిమా?

'బాహుబలి' సినిమా ట్రెయిలర్‌కి యూట్యూబ్‌లో వస్తోన్న స్పందన అలా ఇలా లేదు. కేవలం భారతీయులే కాకుండా విదేశీయులు కూడా ట్రెయిలర్‌ని వీక్షించి రియాక్షన్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రాలతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్‌లో రాజమౌళి ఈ అవుట్‌పుట్‌ తెచ్చాడనేది వారిని విస్మయానికి గురి చేస్తోంది.

ఈసారి బాహుబలి చిత్రాన్ని తెలుగువారితో పాటు భారతీయులంతా అదే రీతిన పోటీలు పడి చూసే అవకాశాలు చాలా ఎక్కువ. ప్రస్తుతమున్న క్రేజ్‌ చూస్తోంటే ఈ భారతీయ చిత్రం కోసం అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారని అర్థమవుతోంది. బాలీవుడ్‌ చిత్రాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి 2 చిత్రాన్ని చాలా దేశాల్లో విడుదల చేస్తున్నారు.

బాహుబలి మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా ఆరు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది. ఇప్పుడున్న క్రేజ్‌కి బాహుబలి 2 తప్పకుండా వెయ్యి కోట్ల గ్రాస్‌ వసూలు చేయగలదని ట్రేడ్‌ అంచనా వేస్తోంది. ఇంతవరకు ఇండియాలో ఏ సినిమా ఈ మైలురాయిని చేరుకోలేదు. అలాగే ఇంత క్రేజ్‌ వచ్చిన సినిమా ఈమధ్య కాలంలో లేదు. ఎలా చూసినా వెయ్యి కోట్ల గ్రాస్‌ బాహుబలికి కేక్‌ వాక్‌ అవుతుందనే అంటున్నారు.

రాజమౌళి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టనున్నాడా? ఈ అంచనాలన్నీ నిజమయి బాహుబలి భారతీయ సినిమాకే తలమానికంగా నిలిచిపోతుందని ఆశిద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు