ఒక్క ఛాన్స్ ప్లీజ్ బాలయ్యా

ఒక్క ఛాన్స్ ప్లీజ్ బాలయ్యా

అమ‌లాపాల్ విడాకుల తీసుకున్న త‌ర్వాత కెరీర్ పైనే దృష్టి పెట్టింది.. అటు మ‌ల‌యాళంలోనూ, ఇటు త‌మిళంలోనూ చేతి నిండా మూవీలు ఉన్నాయి.. టాలీవుడ్ లో మాత్రం ఆమెకు ఒక్క ఛాన్స్ కూడా రావ‌డం లేదు. దీంతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాల‌ని స్కెచ్ వేస్తోంది.  బాలయ్య 101వ మూవీలో నటించాలని తహతహలాడుతోంది . ఇటీవలే బాలయ్య వందో చిత్రంతో గౌతమిపుత్ర శాతకర్ణి తో సంచలన విజయం సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు . దాంతో బాలయ్య తదుపరి చిత్రం పై అంచనాలు పెరిగాయి  ఆ మూవీ తీసే ఛాన్స్ పూరి జగన్నాధ్ కు ఇచ్చాడు బాల‌కృష్ణ‌. చిత్రంలో అమలా పాల్ హీరోఐన్ గా నటించాలని ఆశ పడుతోందట.

ఇందుకోసం ఆమె నేరుగా బాలయ్యనే అప్రోచ్ అయిందని టాక్.  బాలయ్య సినిమాలో నటిస్తే అందునా పూరి జగన్నాధ్ దర్శకులు అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వమని కోరుతోందట. బాలయ్యతో పాటు పూరీని కూడా ఆమె సంప్రదించిందట.

ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో చాన్సిస్తే ఎంత గ్లామ‌ర్ షో కైనా రెడీ అంటూ పూరికి కబరు పంపించిందట అమలాపాల్. అసలే బాలయ్యపై మాజీ హీరోయిన్లు, టాలీవుడ్ కు బాయ్ చెప్పేసిన వారు ఆరోపణలు గుప్పిస్తున్న తరుణంలో అమలాపాల్ ఇలా ఎదురెళ్లి బాలయ్యతోనే సినిమా తీస్తా... ఏమైనా చూపించేస్తా అంటుండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు