పవర్ స్టార్‌కు పవర్ స్టార్ భయం

పవర్ స్టార్‌కు పవర్ స్టార్ భయం

పవర్ స్టార్ అనగానే మనవాళ్లందరికీ పవన్ కళ్యాణే గుర్తుకొస్తాడు. ఆ మాటకొస్తే తమిళనాడు.. కేరళ వాళ్లను.. ముంబయి వాళ్లను అడిగినా పవర్ స్టార్ అంటే పవన్ అనే అంటారు. కానీ కన్నడ జనాలకు మాత్రం పవర్ స్టార్ వేరు. లెజెండరీ యాక్టర్ రాజ్ కుమార్ చిన్న కొడుకు పునీత్ రాజ్ కుమార్‌ను అక్కడివాళ్లు పవర్ స్టార్ అని పిలుచుకుంటారు.

పూరి జగన్నాథ్ సినిమా ‘అప్పు’ (ఇడియట్ ఒరిజినల్)తో హీరోగా పరిచయమై చాలా త్వరగా పెద్ద స్టార్ అయిపోయాడు పునీత్. ఈ హీరో కొత్త సినిమా ‘రాజకుమార’ మంచి అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఆ పవర్ స్టార్‌కు మన పవర్ స్టార్ భయం పట్టుకుంది.

‘రాజకుమార’ రిలీజయ్యే మార్చి 24నే పవన్ ‘కాటమరాయుడు’ కూడా రిలీజవుతోంది. తెలుగు సినిమాలకు కర్ణాటకలో ఎలాంటి ఆదరణ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ పవన్ సినిమా అంటే అక్కడ క్రేజ్ మామూలుగా ఉండదు. కర్ణాటకలోని సగం ప్రాంతాల్లో మంచి క్రేజ్ మధ్య మన సినిమాలు రిలీజవుతాయి. బెంగళూరుతో పాటు బళ్లారి లాంటి ప్రాంతాల్లో హంగామా మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో ‘రాజకుమార’కు పవన్ పంచ్ పడుతుందేమో అని కంగారు పడుతోంది ఆ చిత్ర యూనిట్.

గతంలో వేరే భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు కన్నడ చిత్రాన్ని దెబ్బ తీస్తున్నాయంటూ అనువాద చిత్రాలపై నిషేధం విధించింది కన్నడ చిత్ర పరిశ్రమ. అయినప్పటికీ తెలుగు.. తమిళం నుంచి వచ్చే డైరెక్ట్ సినిమాలే వాటికి పెద్ద ముప్పుగా ఉన్నాయి. ‘కాటమరాయుడు’కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ‘రాజకుమార’కు బ్యాండ్ తప్పదని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English