అంతా ఆయన కష్టమే అంటున్న రాజమౌళి

అంతా ఆయన కష్టమే అంటున్న రాజమౌళి

'బాహుబలి' అంటే కేవలం ఒక సినిమా కాదు. అదొక బ్రాండ్. ఈ పేరుతో పుస్తకాలొస్తున్నాయి. గ్రాఫిక్ నావల్స్ వస్తున్నాయి. వీఆర్ వీడియోలొస్తున్నాయి. వీడియో గేమ్స్ వస్తున్నాయి. ఇంకా మరిన్ని మార్గాల్లో సినిమాను మార్కెట్ చేస్తున్నారు. బోలెడంత ఆదాయం జనరేట్ చేస్తున్నారు. ఐతే ఇదంతా తన క్రెడిట్ ఎంతమాత్రం కాదంటున్నాడు రాజమౌళి.

నిర్మాత శోభు యార్లగడ్డే ఇదంతా ప్లాన్ చేశాడని.. హాలీవుడ్ మోడల్‌ను అద్భుతంగా అమలు చేసి.. గొప్ప ఫలితాలు సాధించాడని.. ఆయన్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నానని అంటున్నాడు రాజమౌళి. బాలీవుడ్ క్రిటిక్ రాజీవ్ మసంద్‌తో ఇంటర్వ్యూలో రాజమౌళి దీని గురించి మాట్లాడాడు.

''హాలీవుడ్ వాళ్లు తమ సినిమాల్ని సినిమాలు మాత్రమే చూడరు. సినిమాను రకరకాలుగా మార్కెట్ చేసుకుంటారు. బోలెడంత ఆదాయం సమకూర్చుకుంటారు. దీన్ని 'ట్రాన్స్ మీడియా' అంటారు. నిజానికి నాకీ పదం కూడా తెలియదు. దాన్ని నాకు పరిచయం చేసింది శోభు గారే. హాలీవుడ్ వాళ్లు ఇలా చేస్తారని తెలుసు కానీ.. మనం దాన్ని ఎలా అన్వయించుకోవాలి.. ఎలా మార్కెట్ చేసుకోవాలని నాకు తెలియదు. శోభు గారే ఇదంతా ప్లాన్ చేశారు. ఎంతో రీసెర్చ్ చేశారు.

'బాహుబలి'కి ఆ పొటెన్షియాలిటీ ఉందని గుర్తించి.. మనం కూడా అలా చేయొచ్చని అన్నారు. అంతా ప్లాన్ చేసి.. నిపుణుల్ని రప్పించి సినిమాను రకరకాల మార్గాల్లో మార్కెట్ చేశాడు. అద్భుతమైన స్పందన వచ్చింది. 'బాహుబలి' సినిమాగా ముగిసిపోయినా.. బాహుబలి ప్రపంచం మాత్రం కొనసాగుతుంది. నా వంతుగా వాటికి సహకారాన్ని కొనసాగిస్తా'' అని రాజమౌళి తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు