రోజుకోసారి టాప్‌ లేపేస్తున్నారు

రోజుకోసారి టాప్‌ లేపేస్తున్నారు

ఒక పాట గురించి సినిమా రిలీజవ్వకముందే ఇంత పబ్లిసిటీ జరగడం ఇదే మోదటిసారేమో. అంటే పాట ట్యూన్‌ ఎక్స్‌ట్రార్డనరీగా ఉంటే మాత్రం ఆటోమ్యాటిక్‌గా కెవ్వు కేక అంటూ బాగా పేరొచ్చేది. కాని పాట ట్యూన్‌ ఇంకా అంత ప్రాచుర్యం చెందలేదుకాని, పాటలోని స్టయిలిష్‌ స్టెప్పుల గురించి, ఒక సెక్సీభామ లుక్కుల గురించి తెగ పబ్లిసిటీ ఇస్తున్నారు.

ఇద్దరమ్మాయిలతో సినిమాలో టాప్‌ లేసిపోద్ది అని ఒక పాట ఉంది. మంచి ఊర మాస్‌ సాంగ్‌లా ఉన్న ఈ పాటలో బన్నీ డ్యాన్సులు మామూలుగా లేవంటూ రోజుకొకరు చెబుతున్నారు. మొన్న దర్శకుడు పూరి, నిన్న నిర్మాత గణేష్‌, ఇవాళ ఎడిటర్‌ శేఖర్‌, ఇలా అందరూ ఆ పాట గురించి ఎక్కువగా చెప్పేయడంతో జనాలకు ఆ పాటలో ఏముందోనని తెగ కుతూహలం పెరిగిపోయింది.

ఇలా అంచనాలు పెంచేస్తే, ఏ మాత్రం నచ్చకపోయినా పాట ఫ్లాపవ్వడం ఖాయం కాబట్టి, మనోళ్ళు కాస్త లిమిట్‌లో ఉంటేనే బెటర్‌. కాదు కూడదూ మేము  రోజుకోసారి టాప్‌ లేపేస్తామంటే, పాట బయటకొచ్చాక మేము మీ  టాప్‌ లేపేస్తామంటున్నారు విమర్శకులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు