కేసీఆర్ రాక తో అంతా షాక్ తిన్నారు

కేసీఆర్ రాక తో అంతా షాక్ తిన్నారు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాల‌కు, ఆయ‌న విభిన్న‌మైన వ్య‌క్తిత్వానికి ఇదో నిద‌ర్శ‌నం. ఉద్య‌మం స‌మ‌యం నుంచి మొద‌లుకొని ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత కూడా కేసీఆర్‌పై దుమ్మెత్తిపోసిన  టీడీపీ సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు విష‌యంలో కేసీఆర్ ఊహించ‌ని అడుగువేశారు. త్వ‌ర‌లో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి అంటూ ఊరిస్తున్న‌ప్ప‌టికీ అది నెర‌వేర‌క‌పోవ‌డంతో టీడీపీలో కేవ‌లం నామ్ కే వాస్తీ అన్న‌ట్లుగా ఉంటున్న మోత్కుప‌ల్లి ఇటీవ‌ల త‌న విమ‌ర్శ‌ల ప‌ర్వాన్ని కాస్త త‌గ్గించుకున్న సంగ‌తి తెలిసిందే.

అయితే కేసీఆర్ అంటేనే ఇంతెత్తున్న ఎగిరిప‌డే మోత్కుప‌ల్లి ముఖ్య‌మంత్రి నివాసానికి వెళ్లి మ‌రీ కేసీఆర్‌ను క‌లిశారు. సుమారు గంట పాటు వారు ముచ్చ‌ట్లు పెట్టుకున్నారు. ఇది మోత్కుప‌ల్లి పార్టీ మార్పు ఎపిసోడ్‌కు సిగ్న‌ల్ అని కొంద‌రు భావించారు. అయితే అలాంటిదేమీ లేద‌ని త‌న బిడ్డ పెళ్లికి ఆహ్వానం అందించేందుకు వెళ్లాన‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు తెలిపారు. ఈ విష‌యం ఇలా ఉంటే..ఇంటికి వ‌చ్చాడు కాబ‌ట్టి మొహ‌మాటానికి కేసీఆర్ మాట్లాడారే త‌ప్ప త‌న‌ను తీవ్రంగా దుయ్య‌బ‌ట్టిన మోత్కుప‌ల్లి ఇంట్లో పెళ్లికి కేసీఆర్ ఎందుకు వెళ‌తారు అంటూ ప‌లువురు విశ్లేషించారు. కానీ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లు ఉంటే ఆయ‌న కేసీఆర్ ఎందుకవుతారు?

ఎంచ‌క్కా మోత్కుప‌ల్లి బిడ్డ పెళ్లికి కేసీఆర్ వెళ్లిపోయారు. అంతేకాదు త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌ను, కొంద‌రు ఎమ్మెల్యేల‌ను కూడా వెంట తీసుకుపోయారు. ఇంకా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏమంటే బ‌డ్జెట్ స‌మావేశాల్లో కీల‌క‌మైన ప్ర‌సంగం చేయాల్సి ఉన్న‌ప్ప‌టికీ కేసీఆర్ దాన్ని లైట్ తీసుకొని మ‌రీ మోత్కుప‌ల్లి ఇంటి శుభకార్యానికి హాజ‌ర‌య్యారు. కేసీఆర్ ఇలా హాజ‌ర‌వ‌డం చూసి మోత్కుప‌ల్లి కూడా ఒకింత షాక్ తిని ఉంటాడోన‌ని అంటున్నారు. చిత్రంగా ఈ స‌మావేశానికి మోత్కుప‌ల్లి ఎంత‌గానో న‌మ్ముకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు హాజ‌ర‌వలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు