చిరంజీవి హర్ట్‌ అవుతున్నాడు!

చిరంజీవి హర్ట్‌ అవుతున్నాడు!

బుల్లితెరపైకి ఘన స్వాగతం లభిస్తుందని ఆశించిన చిరంజీవికి చుక్కెదురైంది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టీఆర్పీల్లో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అనుకుంటే, సెలబ్రిటీలు హోస్ట్‌ చేసిన షోస్‌లో అతి తక్కువ టీఆర్పీలు వస్తోన్న షోగా రికార్డుకెక్కేలా వుంది. చిరంజీవి అభిమానులంతా సాయంత్రమైతే టీవీలకి అతుక్కుపోతారని, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టెలికాస్ట్‌ అయ్యే టైమ్‌లో వ్యూయర్స్‌ని ఆకట్టుకోవడానికి మిగతా ఛానళ్లు చాలా ఎత్తులు వేయాలని అబ్బో చాలానే అనుకున్నారు.

కానీ కలలన్నీ కల్లలు చేస్తూ ఈ షోకి ఆడియన్స్‌ లేకుండా పోయారు. ఎప్పుడో బోర్‌ కొట్టేసిన ఎలాంటి నవ్యత లేని కార్యక్రమాన్ని చూసేందుకు జనాల్లో ఆసక్తి లేదు. చిరంజీవి కోసమని వినోదాత్మకంగా వుండే మిగతా కార్యక్రమాలని వదిలేసుకుని ఎవరూ బోర్‌ ఫీలవ్వలేరుగా? అయితే మెగాస్టార్‌ని ఎక్కడో ఒక రేంజ్‌లో ఊహించిన మాటీవీ యాజమాన్యం ఈ కార్యక్రమానికి వస్తోన్న టీఆర్పీలు చూసి అవాక్కవుతోందట.

ఈ కార్యక్రమం ఎలా రిసీవ్‌ చేసుకుంటారోనని మొదట్నుంచీ ఉత్కంఠగా చూసిన చిరంజీవి ఇది ఫెయిల్‌ అయిందనేది మింగుడు పడడం లేదట. రాజకీయాల్లో ఆల్రెడీ ఫెయిల్‌ అయిన చిరుకి బుల్లితెరపై అరంగేట్రం కూడా సరిగా జరగలేదు. ఈ షో ఇంతగా ఫ్లాప్‌ అయిన నేపథ్యంలో మరి చిరంజీవి నెక్స్‌ట్‌ స్టెప్‌ ఏమిటో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు