ఐశ్వ‌ర్య‌ను స‌ల్మాన్ కొట్టలేద‌ట‌!

ఐశ్వ‌ర్య‌ను స‌ల్మాన్ కొట్టలేద‌ట‌!

నిజ‌మే... ఒక‌ప్పుడు ప్రేమ ప‌క్షులుగా తిరిగిన బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌, టాప్ హీరోయిన్ ఐశ్వ‌ర్యా రాయ్‌ల ప్రేమాయ‌ణం అంద‌రికీ తెలిసిందే. ఏమైందో తెలియ‌దు గానీ... ఇద్ద‌రూ విడిపోయారు. స‌ల్మాన్ త‌న సినిమాలు తాను చేసుకుంటుండ‌గా, సినిమాల‌తో పాటు పెళ్లి కూడా చేసేసుకుంది ఐశ్వ‌ర్య‌. బ‌చ్చ‌న్ ఫ్యామిలీ కోడ‌లిగా మారిపోయిన ఐశ్వ‌ర్య‌... ఇప్పుడు వేరే ప్ర‌పంచ‌మేమీ లేకుండానే త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతోంది. అయితే ఇప్ప‌టికీ పెళ్లి కాని స‌ల్మాన్ మాత్రం... ఇంకా వ‌ధువు కోసం వెతుక్కుంటూనే ఉన్నాడు.

అయినా ఎప్పుడో విడిపోయిన ఐశ్వ‌ర్య ఇప్పుడు స‌ల్మాన్‌కు ఎందుకు గుర్తుకువ‌చ్చిన‌ట్లో తెలియ‌దు గానీ... త‌మ మ‌ధ్య జ‌రిగిన ప్రేమాయ‌ణాన్ని మ‌రోమారు అత‌డు జ్ఞాప‌కం చేసుకున్నాడు. తానేదో ఐశ్వ‌ర్య‌ను కొట్టిన‌ట్టు, తిట్టిన‌ట్టు, వేధించిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌న్న‌ట్లు అత‌డు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గానే మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయినా పెళ్లి చేసుకుని సుఖంగా సంసారం చేసుకుంటున్న ఐశ్వ‌ర్య గురించిన ఆలోచ‌న‌లు స‌ల్మాన్‌కు ఎందుకు వ‌చ్చాయో తెలియ‌దు గానీ... ఆమెను తానేనాడూ బాధ‌పెట్ట‌లేద‌ని అత‌డు ప్ర‌క‌టించాడు.

ఈ విష‌యంపై అత‌డు ఏమ‌న్నాడంటే... ‘‘నేను ఐశ్వర్యను ఎప్పుడూ కొట్టలేదు. తిట్టలేదు. ఆమెను వేధించలేదు. మా మధ్య అలా జరిగిపోయిందంతే. నిజానికి అంతా నన్నే కొట్టేవాళ్లు. తిట్టేవాళ్లు. నాకు కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నన్ను నేను బాధించుకునేవాడిని. గోడకేసి నా తలను బాదేవాణ్ని. నేనంటే ఎవరికీ భయం లేదు. కానీ, ఒక్కసారి మాత్రం డైరెక్టర్ సుభాష్ ఘాయ్‌ను మాత్రం కొట్టాను. అది నా తప్పే కాదు. అతడి ప్రవర్తన పట్ల విసిగి..వేసారిన తర్వాతే అతడిపై చేయి చేసుకున్నాను. నా షూపై అతడు మూత్రం పోసేవాడు. నా మీదకు స్పూన్లు విసిరేవాడు. అంతేకాదు.. తినే ప్లేట్‌ను కూడా నా మీదకు విసిరాడు. నన్ను పక్కకు తోసేసేవాడు. దీంతో నేను సహనం కోల్పోయి అతడిని కొట్టాను. తప్పు అతడిదే అయినా.. నేను కొట్టినందుకు క్షమాపణలు కూడా కోరాను’’ అంటూ ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చాడు సల్మాన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు