ఫ్లాప్ సినిమా కి కుడా కారు గిఫ్ట్ ఇచ్చేశారుగా

ఫ్లాప్ సినిమా కి కుడా కారు గిఫ్ట్ ఇచ్చేశారుగా

స్టార్ హీరోల సినిమాలు పెద్ద హిట్టయినపుడు హీరోకు నిర్మాతో.. దర్శకుడికి హీరోనో కార్లు బహుమతిగా ఇచ్చే సంస్కృతి ఈ మధ్య ఊపందుకుంటోంది. ‘శ్రీమంతుడు’ సినిమాకు గాను మహేష్.. కొరటాలకు కారు గిఫ్టివ్వడం.. అలాగే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సుకుమార్.. నిర్మాత నుంచి కారు బహుమతిగా అందుకోవడం చూశాం.

ఇంకా ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి. ఐతే ఇప్పుడు కమెడియన్ టర్న్డ్ హీరో సప్తగిరి సైతం ఇలాగే తన నిర్మాత నుంచి కారు బహుమతిగా అందుకోబోతున్నాడట. సప్తగిరి హీరోగా పరిచయమైన ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా సాధించిన విజయానికి పొంగిపోయి నిర్మాత రవికిరణ్ తన హీరోకు కారు బహుమతిగా ఇస్తున్నాడట.

ఎప్పుడో డిసెంబరు 23న విడుదలైన సినిమా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు పర్వాలేదనిపించాయి. ఐతే సినిమా విడుదలై దగ్గర దగ్గర మూడు నెలలు కావస్తుంటే ఇప్పుడు ఈ చిత్రానికి 50 రోజుల వేడుక చేశారు. ఈ వేడుకలో నిర్మాత రవికిరణ్ మాట్లాడుతూ.. ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిన్న సినిమాగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించిందని.. అందుకే సప్తగిరికి కారు బహుమతిగా ఇస్తున్నానని తెలిపాడు.

ఐతే సప్తగిరికి కారు గిఫ్టించేంతగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ విజయం సాధించిందా అన్నదే ఇక్కడ సందేహం. ఓ మోస్తరు ఓపెనింగ్స్‌తో మొదలై.. రెండో వారం నుంచి కనిపించకుండా పోయిన సినిమాకు 50 రోజుల వేడుక చేయడం.. హీరోకు కారు గిఫ్టిస్తున్నట్లుగా ప్రకటించడం కొంచెం అతిగానే అనిపిస్తోంది.