డార్లింగ్ ఓకే అంటే పెళ్లికి రెడీ అన్న హీరోయిన్

డార్లింగ్ ఓకే అంటే పెళ్లికి రెడీ అన్న హీరోయిన్

అందరిలా ఉంటే ఎలా అనుకుందో ఏమో కానీ..ద్వారకలో హీరోయిన్ పూజా జవేరీ తాజాగా చేసిన వ్యాఖ్య ఒకటి సర్ ప్రైజ్ చేసేస్తోంది. టాలీవుడ్ హీరోయిన్లు ఎవరూ చెప్పనంత ఓపెన్ గా.. బోల్డ్ గా డార్లింగ్ ప్రభాస్ అంటే తనకంత ఇష్టమన్న విషయాన్ని చెప్పేసి ఆశ్చర్యానికి గురి చేసింది. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన డార్లింగ్ ఇప్పటికి పెళ్లి ఊసెత్తని వైనం తెలిసిందే.

బాహుబలి కోసం మూడేళ్ల కెరీర్ ను ఇచ్చేసిన ఆయన..ఆ సినిమా పూర్తి అయిన వెంటనే పెళ్లి చేసేసుకుంటారని అనుకున్నారంతా.కానీ..అందుకు భిన్నంగా సుజిత్ సినిమాకు ఓకే చెప్పేసి.. ఇప్పుడా సినిమా షూటింగ్ లో బిజీ అయిపోయాడు. ఇలాంటి వేళ పూజా జావేరి మాట్లాడుతూ..తనకు ప్రభాస్ అంటే పిచ్చి ఇష్టమని.. అతను కానీ పెళ్లికి ఓకే అంటే.. ఆయన్ను పెళ్లి చేసుకోవటానికి తాను రెడీ అని ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసింది.ఒక హీరోయిన్ ఇలా ఓపెన్ గా తనకున్న లవ్వును ఎక్స్ ప్రెస్ చేయటం అరుదు.మరి.. దీనికి ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతారో..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు