లారెన్స్‌ టోటల్‌గా చెడగొట్టేసాడు

లారెన్స్‌ టోటల్‌గా చెడగొట్టేసాడు

'పటాస్‌' తెలుగులో ఎంత పెద్ద హిట్‌ అయిందనేది తెలిసిందే. కళ్యాణ్‌రామ్‌తో చేస్తేనే బ్లాక్‌బస్టర్‌ అయిన ఆ సినిమా ఎన్టీఆర్‌లాంటి స్టార్‌తో చేసినట్టయితే యాభై కోట్లు వసూలు చేసి వుండేదని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అయిన పటాస్‌ తమిళ రీమేక్‌ హక్కులని లారెన్స్‌ తీసుకున్నాడు.

తనే హీరోగా నటించి 'మోట్ట శివ కేట్ట శివ' అనే పేరుతో రిలీజ్‌ చేసాడు. తెలుగులో పటాస్‌ ఎంత సింపుల్‌గా వుంటుందో తమిళంలో అంత లౌడ్‌గా తయారైంది. రజనీకాంత్‌ని ఇమిటేట్‌ చేస్తూ లారెన్స్‌ చేసిన ఓవరాక్షన్‌కి జనర సినిమా పూర్తయ్యేవరకు థియేటర్లలో కూర్చోవడం లేదు. ముని సిరీస్‌లో హారర్‌ సినిమాలు చేసుకోక లారెన్స్‌ ఇలా హీరోలా ఫీలవడం దేనికనే కామెంట్స్‌ కూడా పడుతున్నాయి. శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ చిత్రానికి తమిళనాడు రూరల్‌ ఏరియాల్లో ఓపెనింగ్‌ బాగానే వచ్చిందట.

కానీ సినిమా మరీ భరించలేకుండా వుండే సరికి ఎక్కువ రోజుల పాటు థియేటర్లలో వుండదని తమిళ ట్రేడ్‌ చెబుతోంది. తమిళంలో పలువురు యువ హీరోలు పటాస్‌ రీమేక్‌ చేయడానికి ఆసక్తి చూపిస్తే తనే చేస్తానంటూ రైట్స్‌ తీసుకున్న లారెన్స్‌ తను హిట్‌ కొట్టకపోగా, మంచి సినిమాని చెడగొట్టి మిగతా వాళ్ల పొట్ట కొట్టాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు